Periods: బ్లీడింగ్ ఎక్కువవుతోందా? అశ్రద్ధ చేయద్దు!
నెలనెలా వచ్చే నెలసరి సహజమే అయినప్పటికీ ఆ సమయంలో తలెత్తే శారీరక నొప్పులు, రక్తస్రావంతో ఒకింత అసౌకర్యానికి గురవుతుంటాం. కొంతమందిలో అయితే ఈ సమయంలో బ్లీడింగ్ మరింత ఎక్కువవుతుంటుంది. పిరియడ్స్ సమయంలో ఇది సహజమే కదా అని చాలామంది దీని గురించి...
నెలనెలా వచ్చే నెలసరి సహజమే అయినప్పటికీ ఆ సమయంలో తలెత్తే శారీరక నొప్పులు, రక్తస్రావంతో ఒకింత అసౌకర్యానికి గురవుతుంటాం. కొంతమందిలో అయితే ఈ సమయంలో బ్లీడింగ్ మరింత ఎక్కువవుతుంటుంది. పిరియడ్స్ సమయంలో ఇది సహజమే కదా అని చాలామంది దీని గురించి పట్టించుకోరు. కానీ ఒక్కోసారి ఇది తీవ్ర అనారోగ్యాలకు సైతం దారితీయచ్చని చెబుతున్నారు నిపుణులు. అందుకే ఇలాంటి పరిస్థితిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించి.. సమస్య తీవ్రం కాకుండా జాగ్రత్తపడమంటున్నారు. మరి, ఇంతకీ నెలసరి సమయంలో అధిక రక్తస్రావం ఎందుకవుతుంది? దాన్ని ఎలా తెలుసుకోవచ్చు? ఫలితంగా ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి? వంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!
సాధారణంగా నెలసరి ప్రారంభమయ్యాక ఒకటి నుంచి మూడు రోజుల పాటు కాస్త ఎక్కువ మొత్తంలోనే బ్లీడింగ్ అవుతుంటుంది. కొంతమంది ఐదు రోజుల దాకా ఇదే అసౌకర్యాన్ని భరిస్తుంటారు. నిజానికి ఒక రుతుచక్రంలో మహిళలు సుమారు 30-40 మి.లీ. రక్తాన్ని కోల్పోతుంటారు. అదే 60-80 మి.లీ. కంటే ఎక్కువ రక్తం బ్లీడింగ్ రూపంలో బయటికి వెళ్లిపోతే దాన్ని అధిక రక్తస్రావంగా పరిగణించచ్చంటున్నారు నిపుణులు. ఈ స్థితిని వైద్య పరిభాషలో మెనొరేజియా (Menorrhagia) గా పేర్కొంటున్నారు. అయితే చాలామంది మహిళలు ఇది సహజమే కదా అని చాలా తేలిగ్గా తీసుకుంటుంటారు. ఈ నిర్లక్ష్యమే పనికిరాదని, ఈ సమస్యే ముందు ముందు రక్తహీనతకు దారితీసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
హెవీ బ్లీడింగ్.. ఎందుకు?
30-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో ఇది సహజంగా జరిగేదేనని, సుమారు 50 శాతం కంటే ఎక్కువమంది మహిళల్లో వారి గర్భాశయంలో ఎలాంటి సమస్యలు లేకుండానే నెలసరి సమయంలో అధిక రక్తం బయటికి పోతుందని చెబుతున్నారు. ఇక మిగతా 50 శాతం మంది మహిళల్లో ఇలా జరగడానికి ఫైబ్రాయిడ్స్, ప్రెగ్నెన్సీ సమస్యలు (ఉదాహరణకు.. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ - గర్భాశయం వెలుపల పిండం ఏర్పడడం), పీసీఓఎస్, ఐయూడీ (గర్భనిరోధక పద్ధతి) ఉపయోగించడం, క్యాన్సర్.. వంటి పలు సమస్యలు కారణమై ఉండచ్చంటున్నారు. అందుకే అసలు కారణమేంటో తెలుసుకోవాలంటే ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లి వారు సూచించిన పరీక్షలన్నీ చేయించుకోమంటున్నారు.
ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి?
అధిక రక్తస్రావాన్ని అసాధారణంగా ఎప్పుడు పరిగణించాలో తెలుసుకోవడానికి కొన్ని సూచికలున్నాయంటున్నారు నిపుణులు. వాటిని గుర్తించి సకాలంలో వైద్య సహాయం తీసుకోమంటున్నారు. అదెప్పుడంటే..
* గంట గంటకూ శ్యానిటరీ ప్యాడ్స్/ట్యాంపూన్స్ మార్చుకోవాల్సి వచ్చినప్పుడు
* సాధారణంగా నెలసరి సమయంలో ఒకటి నుంచి మూడు రోజుల దాకా కాస్త ఎక్కువగా.. నాలుగు, ఐదు రోజుల్లో ఓ మోస్తరుగా రక్తస్రావం అవుతుంటుంది. అలాకాకుండా ఏడు రోజుల దాకా బ్లీడింగ్ కొనసాగితే..!
* రక్తస్రావంతో పాటు రక్తం పెద్ద పెద్ద గడ్డల్లాగా (Larger Blood Clots) బయటికి వచ్చినప్పుడు..!
* విడవకుండా పొత్తి కడుపులో నొప్పి రావడం..
* శరీరం శక్తిని కోల్పోవడం, విపరీతమైన నీరసం, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అధిక రక్తస్రావానికి ఏదో బలమైన కారణమే ఉండచ్చని భావించి వెంటనే నిపుణుల్ని సంప్రదించడం ఉత్తమం.
ఇలా గుర్తిస్తారు!
అధిక రక్తస్రావానికి అసలు కారణమేంటో తెలుసుకోవడానికి రక్త పరీక్ష, పాప్‌స్మియర్ టెస్ట్, ఎండోమెట్రియల్ బయాప్సీ, అల్ట్రాసౌండ్ స్కాన్, సోనోహిస్టరోగ్రామ్, హిస్టరోస్కోపీ, డయలేషన్ అండ్ క్యురెటేజ్ (డీ అండ్ సీ).. వంటి పరీక్షలు చేస్తారు. దీంతో పాటు మీ వయసు, ఆరోగ్యం, గతంలో మీకు జరిగిన ఇతర చికిత్సలు (Medical History).. వంటి అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని మీ సమస్యేంటో ఒక నిర్ధారణకు వస్తారు. ఆపై ఆయా సమస్యలను బట్టి ఐరన్ సప్లిమెంట్స్, ఇతర మందులు సూచిస్తారు. అలాగే రక్తస్రావం సాధారణ స్థితికి వచ్చేలా వివిధ రకాల థెరపీలు చేయించుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. రక్తస్రావం అదుపులోకి రావడానికి ఆయా సమస్యల్ని బట్టి కొంతమందికి ఆపరేషన్ కూడా చేయాల్సి రావచ్చంటున్నారు నిపుణులు.
ఇంటి చిట్కాలతో..!
డాక్టర్ సూచించిన మందులు వాడుతూ, కొన్ని ఇంటి చిట్కాల్ని పాటిస్తే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడచ్చంటున్నారు నిపుణులు. అవేంటంటే..!
* శరీరంలో నుంచి బ్లీడింగ్ రూపంలో ఎక్కువ రక్తం బయటికి వెళ్లిపోవడం వల్ల కొన్నాళ్లకు రక్తహీనత తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సమస్య రాకూడదంటే ఎక్కువ మోతాదులో నీళ్లు తాగాల్సి ఉంటుంది. అలాగే ఉప్పు కాస్త ఎక్కువగా తీసుకోవడం, ఎలక్ట్రోలైట్ ద్రావణాలు తీసుకోవడం వల్ల కూడా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకుంటూ.. రక్తం స్థాయులు తగ్గకుండా జాగ్రత్తపడచ్చు.
* ‘సి’ విటమిన్ శరీరానికి ఐరన్‌ను గ్రహించే శక్తినిస్తుంది. తద్వారా భవిష్యత్తులో అనీమియా బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు. ఇందుకోసం ఈ విటమిన్ అధికంగా లభించే స్ట్రాబెర్రీస్, కివీ, నిమ్మజాతి పండ్లు, టొమాటో, క్యాప్సికం.. వంటివి రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోవాలి.
* అధిక రక్తస్రావం కారణంగా శరీరం ఐరన్ ఎక్కువగా కోల్పోతుంది.. కాబట్టి ఈ పోషకం ఎక్కువగా లభించే కోడి మాంసం, బీన్స్, పాలకూర, టోఫు.. వంటి పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఐరన్ పాత్రల్లో వండుకుంటే మరింత మంచి ఫలితం ఉంటుంది.
వీటితో పాటు అత్యవసరమైతే డాక్టర్ సలహా మేరకు ఐరన్ సప్లిమెంట్స్ కూడా వేసుకోవచ్చు. కాబట్టి అధిక రక్తస్రావాన్ని అలక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే సకాలంలో చికిత్స చేయించుకోవచ్చు.. ఫలితంగా అనీమియా, దాని మూలంగా ఇతర అనారోగ్యాల బారిన పడే ముప్పు తప్పుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
- గోటితోనే పోదు మరి!
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
- మీ స్కోరెంత?
అనుబంధం
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
- పాప వల్ల నాతో ఆ సంతోషం ఉండట్లేదంటున్నారు..!
యూత్ కార్నర్
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
- తెల్లజుట్టు... కారణమేంటి?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
- చిన్నారుల చిత్రకళా ప్రదర్శన..!
- అద్దమూ మెరవాలిగా..!
వర్క్ & లైఫ్
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!
- ఆఫీసులో ఇలా చేస్తున్నారా?
- అయితే... నేలపై పడుకోండి!