అనుకున్నట్లే పవర్ పంచ్‌లతో ‘కంచు’ మోగించింది!
ఆడేది మొదటి ఒలింపిక్స్ అయినా ఏ మాత్రం బెదరలేదు. ప్రత్యర్థి ఎవరన్నది చూడకుండా తన పవర్ పంచ్‌ల రుచిని చూపించింది. ప్రపంచ మేటి బాక్సర్లను సైతం మట్టి కరిపించి భారత్ ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక పతకాన్ని చేర్చింది లవ్లీనా బొర్గొహెయిన్. టోర్నీ ఆద్యంతం అద్భుతంగా ఆడిన ఈ 23 ఏళ్ల అమ్మాయి... సెమీస్‌లో ఓటమి పాలై కాంస్యాన్ని ముద్దాడింది. ఈ క్రమంలో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్‌గా, మేరీకోమ్ తర్వాత రెండో భారత మహిళగా చరిత్ర సృష్టించింది.
(Photo: Twitter)
ఆడేది మొదటి ఒలింపిక్స్ అయినా ఏ మాత్రం బెదరలేదు. ప్రత్యర్థి ఎవరన్నది చూడకుండా తన పవర్ పంచ్‌ల రుచిని చూపించింది. ప్రపంచ మేటి బాక్సర్లను సైతం మట్టి కరిపించి భారత్ ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక పతకాన్ని చేర్చింది లవ్లీనా బొర్గొహెయిన్. టోర్నీ ఆద్యంతం అద్భుతంగా ఆడిన ఈ 23 ఏళ్ల అమ్మాయి... సెమీస్‌లో ఓటమి పాలై కాంస్యాన్ని ముద్దాడింది. ఈ క్రమంలో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్‌గా, మేరీకోమ్ తర్వాత రెండో భారత మహిళగా చరిత్ర సృష్టించింది.
ప్రత్యర్థులపై పవర్ పంచ్‌లు!
అస్సాంకు చెందిన లవ్లీనా తొలిసారిగా ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తోంది. టోక్యో ఒలింపిక్స్ ముందు వరకు కూడా ఆమెపై ఎలాంటి అంచనాలు లేవు. బహుశా ఇదే ఈ యంగ్ బాక్సర్ పాలిట అదృష్టంగా మారిందేమో. ప్రారంభ మ్యాచ్ నుంచే ఎంతో దూకుడుగా ఆడిన ఆమె.. క్వార్టర్స్‌లో ఏకంగా మాజీ ప్రపంచ ఛాంపియన్‌ను చిత్తు చేసింది. తద్వారా భారత్ ఖాతాలో మరో పతకాన్ని ఖాయం చేసింది. ఇక సెమీస్ పోరులో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్, టర్కీ బాక్సర్ సుర్మనెలితో పోరాడి ఓడింది. ఈ మ్యాచ్‌లో పరాజయం పాలైనా స్ఫూర్తిదాయక ప్రదర్శనతో మెప్పించి కాంస్యం మెడలో వేసుకుందీ యంగ్ బాక్సర్. ఒలింపిక్స్ బాక్సింగ్ విభాగంలో భారత్ పతకం గెల్చుకోవడం ఇది మూడోసారి. లవ్లీనా కంటే ముందు 2008లో విజేందర్ సింగ్, 2012లో మేరీకోమ్ కాంస్య పతకాలు సాధించారు. అయితే 69 కేజీల విభాగంలో మాత్రం భారత్‌కు తొలి ఒలింపిక్ పతకాన్ని అందించింది లవ్లీనానే.
అక్కలను చూస్తూ..!
అస్సాంలోని గోలాఘాట్ జిల్లా బారో ముఖియా గ్రామంలో 1997 అక్టోబర్ 2న జన్మించింది లవ్లీనా. తండ్రి టికెన్ బోర్గోహెన్ ఒక చిన్న వ్యాపారి. తల్లి మామొనీ గృహిణి. లవ్లీనాకు లిచా, లిమా అనే కవలలైన ఇద్దరు అక్కలు ఉన్నారు. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా తన ముగ్గురు కూతుళ్లను బాక్సర్లుగా తయారుచేయాలనుకున్నారు టికెన్. అందుకు తగ్గట్టే లవ్లీనా అక్కలిద్దరూ జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొని సత్తా చాటారు. వారిని చూసి లవ్లీనా కూడా కిక్ బాక్సింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. పాఠశాలతో పాటు జిల్లా స్థాయి పోటీల్లో సత్తా చాటింది. 2011లో బర్తాపూర్ బాలికల పాఠశాలలో చదువుతున్నప్పుడు ఓ కిక్ బాక్సింగ్ ఈవెంట్లో లవ్లీనా అద్భుతంగా ఆడి ‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ దృష్టిలో పడింది. ప్రముఖ కోచ్ పదుమ్బోరో కూడా ఆమెలోని నైపుణ్యానికి ముగ్ధులై శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఇదే క్రమంలో కిక్ బాక్సింగ్ కంటే బాక్సింగ్‌లోనే మెరుగైన అవకాశాలు ఉన్నాయని గ్రహించి దానినే కెరీర్‌గా మల్చుకుంది. అలా 2012 నుంచే బాక్సింగ్‌లో ఈ యంగ్ బాక్సర్ శిక్షణ ప్రారంభమైంది.
అలా టోక్యో బెర్తు ఖరారు చేసుకుంది!
జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటినప్పటికీ లవ్లీనా గురించి ప్రపంచానికి మొదటిసారిగా తెలిసింది 2017లోనే. ఆ ఏడాది వియత్నాం వేదికగా జరిగిన ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఆమె కాంస్య పతకం గెల్చుకుంది. 2018 దిల్లీలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది. ఆ మరుసటి ఏడాది రష్యాలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో కాంస్యాన్ని మెడలో వేసుకుంది. 2020 మార్చిలో జరిగిన ఆసియా- ఓషనియా బాక్సింగ్ ఒలింపిక్ అర్హత టోర్నీలో గెలిచి టోక్యో బెర్తు ఖాయం చేసుకుంది. ఇక ఈ ఏడాది మేలో దుబాయి వేదికగా జరిగిన ఏషియన్ అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లోనూ కాంస్యం గెల్చుకుంది. తద్వారా ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు అవసరమైన ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది.
అటు అమ్మకి ఆపరేషన్.. ఇటు కరోనా..!
గతేడాది మార్చిలో టోక్యో బెర్తును ఖాయం చేసుకున్న లవ్లీనా ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యేందుకు కావాల్సిన సమయం దొరికింది. అయితే ఇంతలో ఆమె తల్లి మామొనీకి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. దీంతో ఆమెను చూసుకునేందుకు ఇంటికి వెళ్లిన లవ్లీనా దురదృష్టవశాత్తూ కరోనా బారిన పడింది. ఈ క్రమంలోనే ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన బాక్సర్ల కోసం సాయ్ ఏర్పాటుచేసిన ప్రత్యేక శిక్షణకు దూరమైంది.
‘కరోనా తర్వాత ప్రాక్టీస్ చేసేందుకు శరీరం ఏ మాత్రం సహకరించలేదు. అయినా నేను వెనకడుగు వేయలేదు. సానుకూల దృక్పథంతో ముందుకెళ్లాను. ధ్యానం చేస్తూ మనసును మరింత ప్రశాంతంగా మార్చుకున్నాను. మహమ్మారిని జయించి మళ్లీ శిక్షణ మొదలుపెట్టాను’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ యువ బాక్సర్.
విశ్వక్రీడల్లో పాల్గొనడం మొదటిసారే అయినప్పటికీ ఎక్కడా తడబడలేదు లవ్లీనా. ప్రత్యర్థి ఎవరనేది ఆలోచించకుండా పవర్ పంచ్‌లు కురిపిస్తూ ముందుకు సాగింది.
అలీ ఆదర్శం... టైసన్‌కు ఫ్యాన్!
* చిన్నప్పుడు లవ్లీనా తండ్రి టికెన్ ఓ న్యూస్ పేపర్లో చుట్టుకుని స్వీట్లు తీసుకొచ్చాడు. ఇంట్లో అందరూ ఆ స్వీట్లు తింటుంటే లవ్లీనా మాత్రం న్యూస్ పేపర్లో వచ్చిన మహమ్మద్ అలీ ఫొటో చూస్తూ ఉండిపోయింది. అప్పటి నుంచే బాక్సింగ్‌పై మరింత ఆసక్తి పెంచుకుందట.
* తన బాక్సింగ్ కెరీర్‌కు ఇద్దరు అక్కలతో పాటు అలీ స్ఫూర్తినిచ్చారని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన ఈ యంగ్ బాక్సర్ మైక్ టైసన్ ఆటకు పెద్ద అభిమాని.
* 5 అడుగుల 8 అంగుళాల ఎత్తు ఉండే లవ్లీనాకు బాక్సింగ్‌తో పాటు వ్యవసాయం చేయడమంటే ఎంతో ఆసక్తి. అందుకే ఇంటికొచ్చినప్పుడల్లా తల్లిదండ్రులతో కలిసి పొలం పనులకు వెళ్తూ ఉంటుంది. ఇక గతేడాది జులైలో తల్లి కిడ్నీ వ్యాధి బారిన పడినప్పుడు కూడా వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడువాదోడుగా నిలిచిందీ యువ సంచలనం.
* లాక్డౌన్లో ఇంటికే పరిమితమైనప్పుడు సాధన కోసం ఎలాంటి వసతులు లేకపోవడంతో ఇంట్లో ఉన్న సిలిండర్ ఎత్తుతూ వ్యాయామాలు చేసిందీ అస్సామీ బాక్సర్.
* ఒలింపిక్స్‌లో వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్నప్పటికీ నిత్యం తన తల్లి ఆరోగ్యం గురించి వాకబు చేస్తూనే ఉంది లవ్లీనా. రోజులో కనీసం రెండుసార్లయినా తండ్రికి ఫోన్ చేసి తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటోంది.
* లాక్డౌన్ కాలంలో పెద్దమనసు చాటుకున్న లవ్లీనా ఉపాధి కోల్పోయిన దినసరి కూలీలు, పేదలకు నిత్యవసరాలు సమకూర్చింది.
* బాక్సింగ్‌లో తన పవర్ పంచులకు గుర్తింపుగా గతేడాది రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అర్జున అవార్డు కూడా అందుకుందీ యువ బాక్సర్.
ఈ విజయం ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తుంది!!
అరంగేట్ర ఒలింపిక్స్‌లోనే కాంస్య పతకాన్ని మెడలో వేసుకున్న లవ్లీనాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘ఈ విజయం ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తుంది’ అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదితర ప్రముఖులు ట్విట్టర్ వేదికగా ఈ యంగ్ బాక్సర్‌ను అభినందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
- గడువు దాటితే వద్దు...
ఆరోగ్యమస్తు
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
- వ్యాయామం చేయలేకపోతున్నారా?
అనుబంధం
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
- పిల్లలకీ కావాలో రొటీన్!
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
- వాచీ రింగు పూల హంగు!
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!