నిర్మలమ్మ..కసూతి అందాలు!

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్టే కాదు.. అందమైన కసూతీ పనితనంతో ఆవిడ కట్టుకున్న చీరా అందరిలో ఆశక్తి కలిగించింది.

Updated : 02 Feb 2023 00:45 IST

ర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్టే కాదు.. అందమైన కసూతీ పనితనంతో ఆవిడ కట్టుకున్న చీరా అందరిలో ఆసక్తి కలిగించింది. టెంపుల్‌ డిజైన్‌తో నలుపు, బంగారు వర్ణాల అంచుతో ఆకట్టుకుంటున్న ఎరుపు రంగు చేనేత చీర గురించే ఇప్పుడు చర్చంతా. ఇల్‌కల్‌ చేనేత చీరపై.. నవల గుంద కసూతి పనితనంతో ఈ చీరని రూపొందించారు. దీని పుట్టినిల్లు కర్ణాటకలోని ధార్వాడ్‌ ప్రాంతం. అత్యంత క్లిష్టమైన ఈ పనితనానికి అనేక ప్రత్యేకతలున్నాయి. చాళుక్యుల కాలం నాటిది ఇది. ఒక్క డిజైన్‌కి ఐదువేల కుట్లవరకు పడతాయట. వస్త్రానికి ఎటువైపు నుంచి చూసినా ఒకేలా ఉండటం దీని ప్రత్యేకత. ఎక్కడా ముడి వేయకుండా ఈ కుట్లు వేస్తారు. 17వ శతాబ్దంలో మైసూరు రాణులు ఇష్టపడిన పనితనం ఇది. ఆ కాలంలో 64 కళల్లో దీన్నో కళగా భావించే వారంటే దీని గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. అందమైన రంగవల్లికలే ఈ పనితనానికి స్ఫూర్తి. భౌగోళిక గుర్తింపునీ దక్కించుకుంది. ధరించినప్పుడు శరీరానికి హాయిగా ఉండే ఈ ఇల్‌కల్‌ చీర 800గ్రా బరువుంది. దీనిని  ధార్వాడ్‌లోని ఆర్తిహీరేమత్‌ ఆధ్వర్యంలో మహిళలు ప్రత్యేకంగా రూపొందించారు. నిర్మలమ్మకీ కాలేజీ రోజుల నుంచే చేనేత చీరలంటే మక్కువ ఎక్కువ. గతంలో బొమ్‌కై, సంబల్‌పూర్‌ చీరలపై ఉన్న ఇష్టాన్ని ఓ ట్వీటు రూపంలో చెప్పకనే చెప్పారు. అందుకేనేమో ఆమె పీహెచ్‌డీ పరిశోధనాంశం కూడా ‘ఇండో యూరోపియన్‌ టెక్స్‌టైల్‌ ట్రేడ్‌’ మీదే కావడం విశేషం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్