Radhika Merchant: అంబానీ కోడలు.. అర కోటి బ్యాగు
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ కలల ప్రాజెక్టు ‘నీతా ముకేశ్ అంబానీ సాంస్కృతిక కేంద్రం’ తాజాగా ప్రారంభమైంది. మొత్తం కుటుంబంతోపాటు ప్రముఖ తారలూ హాజరై సందడి చేశారు.
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ కలల ప్రాజెక్టు ‘నీతా ముకేశ్ అంబానీ సాంస్కృతిక కేంద్రం’ తాజాగా ప్రారంభమైంది. మొత్తం కుటుంబంతోపాటు ప్రముఖ తారలూ హాజరై సందడి చేశారు. అయితే అందరినీ ఆకర్షించింది మాత్రం చిన్న కోడలు రాధిక మర్చంట్! కాబోయే భర్త అనంత్ అంబానీతో హాజరైన ఈమె.. నల్లని ఇండో వెస్ట్రన్ స్టైల్ శారీలో మెరిశారు. ఆ సమయంలో ఆవిడ చేతిలో ఓ చిన్న బ్యాగ్ ఉంది. ఆటబొమ్మలా ఉన్న దాని గురించే నెట్టింట చర్చ మొదలైంది. తీరా దాని ఖరీదు బయటికొచ్చాక ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. బుజ్జిగా ఆకర్షించేలా ఉన్న దాని ఖరీదు రూ. అరకోటికి పైనే మరి! వెండి రంగులో ఉన్న ఈ హెర్మిస్ కెల్లీమోర్ఫోస్ బ్యాగుకి అంత ప్రత్యేకత ఏమిటంటారా? ఫ్యాషన్ ప్రియులకు ‘హెర్మిస్’ పరిచయం అక్కర్లేదు. ఇదో ప్రముఖ ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్. ఆ సంస్థ తమ డిజైనర్ బ్యాగులకు ‘కెల్లీ’గా నామకరణం చేసింది. అందుకో కారణమూ లేకపోలేదు. హెర్మిస్.. హ్యాండ్ బ్యాగులను రూపొందించిన తొలిరోజుల్లో ప్రఖ్యాత అమెరికా నటి గ్రేస్ కెల్లీ ఈ బ్యాగును తన వెంట తప్పక తీసుకెళ్లేవారట. ముఖ్యంగా ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు తన పొట్టకు దీన్ని అడ్డుగా పెట్టుకునేవారట. అలా ఈ బ్యాగులకు చాలా ప్రాచుర్యం దక్కడంతో హెర్మిస్ వీటికి ‘హెర్మిస్ కెల్లీ’గా పేరు మార్చింది. తర్వాత కెల్లీమోర్ఫోస్ పేరిట ఆభరణాలనూ రూపొందించింది. రాధిక చేతిలో ఉన్నది బ్యాగ్‌లా కనిపిస్తున్నప్పటికీ.. అదో ఆభరణాల సెట్ కూడా! బ్యాగ్‌కు ఉన్న చిన్న చెయిన్లను పోగులుగా, బెల్ట్‌ను మెడకు చోకర్‌లా పెట్టుకోవచ్చు. అంటే.. బ్యాగే ఆభరణమూ అవుతుందన్న మాట. అందుకే దీని ధర రూ.52 లక్షలపైమాటే!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.