Updated : 14/10/2021 20:26 IST

Kaizen : ఒక్క నిమిషంలో బద్ధకం మాయం!

ఎంతో మక్కువతో ఓ పని ప్రారంభిస్తాం. పూర్తి ఏకాగ్రత దానిపైనే పెడతాం.. అయినా ఒకానొక దశలో బద్ధకం ఆవహించి ‘రేపు చేద్దాంలే!’ అని వాయిదా వేస్తుంటాం. కానీ జపనీయులకు మాత్రం ఇలాంటి వాయిదాలంటే అస్సలు నచ్చదట! మొదలుపెట్టిన పని పూర్తయ్యే దాకా వాళ్లు ఓ పట్టాన వదిలిపెట్టరట! ఒకవేళ బద్ధకంగా అనిపించినా ఒకే ఒక చిన్న టెక్నిక్‌తో దాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేస్తారే తప్ప వాయిదాల పర్వమంటే వారికి అస్సలు గిట్టదట! నిజానికి ఈ టెక్నికే వారి విజయసూత్రం అని చెబుతున్నారు అక్కడి నిపుణులు. మరి, ఇంతకీ ఏంటా సక్సెస్‌ సీక్రెట్‌? రండి.. మనం కూడా తెలుసుకుందాం..!

బద్ధకంగా/సోమరిగా అనిపించినప్పుడు ఏదైనా పని మొదలుపెట్టినా/కొనసాగించినా దాని ఉత్పాదకత ఆశించిన స్థాయిలో రాదన్నది మనలో చాలామంది భావన. అందుకే ‘మూడ్‌ వచ్చినప్పుడు చేద్దాంలే’ అనుకుంటూ దాన్ని వాయిదా వేస్తుంటాం. కానీ ఇలాంటి సమయంలో జపనీయులు పాటించే మంత్రం ‘కైజెన్ (Kaizen)’.

ఏంటీ Kaizen?

జపనీయుల భాషలో Kai (Change) అంటే మార్పు అని, Zen (Wisdom) అంటే ఆలోచన అని అర్థం. అంటే.. పని పట్ల ప్రతికూలంగా ఉన్న మన ఆలోచనల్ని మార్చుకొని పాజిటివ్‌ మూడ్‌లోకి వెళ్లడమన్న మాట!
నిమిషంలో అంతా మారిపోతుంది!

ఇందులో భాగంగా ఒక్క నిమిషం పాటు మన మనసుకు నచ్చిన పని చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. పుస్తకం చదవడం, సంగీతం వినడం, డ్యాన్స్‌ చేయడం.. ఇలా మీ మనసుకు ఏది ఆహ్లాదాన్ని పంచితే నిమిషం పాటు ఆ పని చేయాలి. ఇలా రోజూ ఒకే సమయానికి చేయాల్సి ఉంటుంది. తద్వారా కొన్ని రోజుల్లోనే బద్ధకాన్ని వీడి మనసు పనిమీదికి ఉరకలెత్తుతుందని చెబుతున్నారు అక్కడి నిపుణులు. కావాలంటే కొన్ని రోజులయ్యాక ఈ సమయాన్ని క్రమంగా పెంచుకుంటూ (గరిష్టంగా గంట దాకా) పోవచ్చంటున్నారు.

ఆయనే ఆది!

నిజానికి ఈ టెక్నిక్‌ను జపాన్‌ ఆర్గనైజేషనల్‌ సిద్ధాంత కర్త/మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ Masaaki Imai కనిపెట్టారట! వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ప్రతి విషయంలోనూ ఆయన ఇదే సిద్ధాంతాన్ని పాటించేవారట! ఫలితంగా ప్రతి విషయంలోనూ సక్సెస్‌ సాధించినట్లు ఆయన చెబుతున్నారు. ఇదే పద్ధతి క్రమంగా అక్కడి కంపెనీలు, వ్యాపారవేత్తలు పాటించడం, తమ ఉద్యోగులతో పాటింపజేయడంతో ఉద్యోగులు కూడా ఎంతో ఉత్సాహంగా పనిపై దృష్టి పెడుతున్నట్లు, తద్వారా వంద శాతం ఉత్పాదకత సాధిస్తున్నట్లు అక్కడి నిపుణులు చెబుతున్నారు. తమ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఇదీ ఓ ముఖ్య కారణమే అంటున్నారు వారు.

ఇదంతా వింటుంటే.. ‘నిమిషమే కదా.. పాటిస్తే పోయేదేముంది?’ అనిపిస్తోంది కదూ! అయితే ఆలస్యమెందుకు..? లెట్స్‌ ప్రొసీడ్!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని