పైల్స్ సమస్యకు కారణమేమిటి?
నాకు ౩౩ ఏళ్లు. పైల్స్ సమస్య ఉంది. అవి పెరగడంతో పాటు నొప్పి కూడా కలిగిస్తున్నాయి. అసలు ఈ సమస్య ఎందుకొస్తుంది? దీనికి పరిష్కారం ఏంటో చెప్పండి. - ఓ సోదరి
నాకు ౩౩ ఏళ్లు. పైల్స్ సమస్య ఉంది. అవి పెరగడంతో పాటు నొప్పి కూడా కలిగిస్తున్నాయి. అసలు ఈ సమస్య ఎందుకొస్తుంది? దీనికి పరిష్కారం ఏంటో చెప్పండి. - ఓ సోదరి
జ: పైల్స్ అనేవి ఉబ్బిన రక్తనాళాలు (Veins). ఏదైనా ఒత్తిడి పెరిగినప్పుడు, లేదా రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడినప్పుడు రక్తనాళాల్లో వాపు ఏర్పడవచ్చు. మలద్వారం వద్ద ఈ వాపు ఏర్పడినప్పుడు దాన్ని ‘పైల్స్’ అంటారు. స్త్రీలలో ముఖ్యంగా ఇవి గర్భవతిగా ఉన్నప్పుడు మొదలై తర్వాత క్రమంగా పెరుగుతూ వస్తాయి. ఎందుకంటే గర్భవతిగా ఉన్నప్పుడు పొట్టలో ఒత్తిడి ఎక్కువవడం వల్ల రక్తనాళాలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే మలబద్ధకం ఉన్నా.. మల విసర్జన సమయంలో ఎక్కువగా ఒత్తిడి ఉపయోగించినా, బరువు ఎక్కువగా ఉన్నా ఈ పైల్స్ ఎక్కువగా పెరగడానికి కారణాలవుతాయి. ప్రారంభ దశలో ఉన్నప్పుడు మలబద్ధకం లేకుండా ఉండడానికి ఆహార నియమాలు పాటించడం, స్టూల్ సాఫ్ట్‌నర్స్ వాడడం, రక్తనాళాల్లో వాపు తగ్గడానికి ఆ భాగంలో ఆయింట్‌మెంట్స్ వాడడం.. వంటివి చేస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. మరీ ఎక్కువగా ఉంటే వైద్యులు ఆపరేషన్ సూచిస్తారు. ఏదేమైనా- సమస్య తీవ్రతను బట్టి అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. అలాగే సొంత వైద్యానికి కూడా దూరంగా ఉండాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.