సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Published : 16 Jul 2021 19:37 IST

అంకితా కొన్వర్‌.. బాలీవుడ్‌ నటుడు, మోడల్‌, ఫిట్‌నెస్‌ గురూ అయిన మిలింద్‌ సోమన్‌ భార్యగానే కాక.. ఈ ఫిట్‌నెస్‌ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందామె. సందర్భం వచ్చినప్పుడల్లా బాడీ పాజిటివిటీ గురించి స్పందిస్తూ.. ‘శారీరక లోపాలు అని మనం భావించినవన్నీ మనలోని ప్రత్యేకతలే!’ అంటూ స్ఫూర్తి నింపుతుంటుంది. ఇక ఇప్పుడు శారీరక బరువు ముఖ్యం కాదని.. ఆరోగ్యమే అన్నింటికంటే ప్రధానమంటూ మరో పోస్ట్‌ షేర్‌ చేసింది అంకిత.

ఆ మూడూ ముఖ్యం!

‘నేను ఎక్కువ బరువున్నాను.. త్వరగా తగ్గి సైజ్‌ జీరోకి రావాలి.. అని ఆలోచించే వారి సంఖ్య క్రమంగా తగ్గుతుందనే చెప్పాలి. శరీరాకృతి కాదు.. ఆరోగ్యమే ముఖ్యమన్న విషయం ఈ రోజుల్లో చాలామంది తెలుసుకుంటున్నారు. నిజంగా ఇది శుభపరిణామమే! శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటే.. అది మన జీవితంలోని ప్రతి విషయంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు..

* శారీరక పరంగా ఎలాంటి అనారోగ్యాలు లేకపోతే.. ఏ పనైనా చురుగ్గా చేయగలం.

* అదే మనసు సంతోషంగా ఉంటే.. చీకట్లోనూ వెలుగును చూడగలం.. సానుకూలంగా అడుగు ముందుకు వేయగలం.

* అంతరాత్మను తృప్తి పరచుకుంటూ ముందుకు సాగితే జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించగలం.

నేనైతే కొన్నేళ్లుగా నా నడుం చుట్టుకొలత, బరువు గురించి పట్టించుకోవడం పూర్తిగా మానేశాను. ఆరోగ్యంపైనే పూర్తి దృష్టి పెట్టా.. దీని ఫలితంగానే గత కొన్నేళ్ల నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో ముందుకు సాగుతున్నా. ఈ క్రమంలో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నా. సంతోషంగా ఉండేందుకు దోహదం చేసే అంశాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నా.. అందుకే ఎప్పుడూ ఉత్సాహంగా ఉండగలుగుతున్నా.. మీరూ ఇలా చేస్తే ఆరోగ్యం, ఆనందం.. రెండూ ఏకకాలంలో సొంతమవుతాయి..’ అంటోంది అంకిత.
మరి, మనమూ ఇలా ఓసారి ట్రై చేస్తే పోయేదేముంది? జీవితాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా ఆస్వాదించడం తప్ప! ఏమంటారు?!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్