ఒత్తిడికి యాప్స్‌..!

ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని సంరక్షించే ఇల్లాలికి మాత్రం స్వీయ శ్రద్ధ తక్కువ ఉంటుంది. తమ శారీరక, మానసికారోగ్యంపై దృష్టి సారించరు. ఇదిలాగే కొనసాగి, భవిష్యత్తులో ఏ బాధ్యతనూ సక్రమంగా నిర్వర్తించలేని స్థాయికి చేరుకుంటారు.

Published : 03 Jul 2024 03:39 IST

ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని సంరక్షించే ఇల్లాలికి మాత్రం స్వీయ శ్రద్ధ తక్కువ ఉంటుంది. తమ శారీరక, మానసికారోగ్యంపై దృష్టి సారించరు. ఇదిలాగే కొనసాగి, భవిష్యత్తులో ఏ బాధ్యతనూ సక్రమంగా నిర్వర్తించలేని స్థాయికి చేరుకుంటారు. ఈ సమస్య రాకుండా యాప్‌ల సాయం తీసుకోవచ్చు. వీటిని ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుని అనుసరిస్తే, నిండైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. 

అనుసంధానం చేస్తాయి..

‘హెడ్‌స్పేస్‌’... శారీరకంగానే కాకుండా మానసికారోగ్యాన్ని పెంపొందించుకోవడానికి సాయపడుతుంది. అలాగే సపోర్ట్‌ గ్రూప్స్‌లో చేరే అవకాశం కూడా ఇందులో ఉంటుంది. దీంతో రోజువారీ వ్యాయామాలను ఒంటరిగా చేసినా, వారాంతంలో బృందంతో కలిసి చేయొచ్చు. గ్రూప్‌ సైక్లింగ్, వాకింగ్‌ వంటివాటిలో పాల్గొనొచ్చు. ఫిట్‌నెస్‌తోపాటు యోగాతో మానసిక ఉల్లాసాన్ని పొందొచ్చు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. మెడిటేషన్‌తో జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలను ఎదుర్కోగలిగే నైపుణ్యాలు మెరుగుపడతాయి.

నిపుణుల సలహాలు...

‘కామ్‌’ యాప్‌ ద్వారా మానసికారోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన తగ్గడానికి నిద్రపోయే ముందు కథలు, చెవులకు వీనులవిందైన సంగీతం వంటివన్నీ దీనిద్వారా వినొచ్చు. నిపుణుల సలహాలు, సూచనలనూ పొందొచ్చు. అలాగే ‘టాక్‌స్పేస్‌ థెరపీ అండ్‌ కౌన్సెలింగ్‌’, ‘ద మైండ్‌ఫుల్‌నెస్‌’ వంటి యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే మెడిటేషన్‌ తరగతుల ద్వారా మానసికారోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఎటువంటి నిపుణుల నుంచి సలహా కోరుకుంటున్నామో కూడా ఎంపిక చేసుకునే అవకాశం వీటిలో ఉంటుంది. అలాగే డిజిటల్‌ థెరపిస్టుగా గ్రామీ విజేతలు కంపోజ్‌ చేసే సంగీతాన్ని వినిపించి నిద్ర వచ్చేలా చేసే ‘సోనా’, ఆరోగ్యపరిరక్షణకు పెద్దపీట వేసే ‘హ్యాపీఫై’ వంటివి మరెన్నో యాప్‌లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మైండ్‌ఫుల్‌నెస్‌ సెషన్స్, గైడెడ్‌ మెడిటేషన్‌లను అనుసరించేలా చేసే వీటిని స్వయం సహాయ సాధనంలా ఉపయోగించగలిగితే చాలు. శారీరక, మానసిక ఆరోగ్యాలను పొందొచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్