Kids Gadgets : బుజ్జాయిలకు భలే బ్యాగులు!

పిల్లలు తమకు సంబంధించిన వస్తువులన్నీ బొమ్మల రూపంలోనే ఉండాలని కోరుకుంటారు. అందుకే వారు తినే ప్లేట్ల దగ్గర్నుంచి.. పడుకునే మంచం దాకా.. ఇలా ప్రతిదీ వారికి నచ్చిన బొమ్మలు, ఆకృతుల్లో ఉండేవే....

Updated : 04 Jul 2023 17:56 IST

పిల్లలు తమకు సంబంధించిన వస్తువులన్నీ బొమ్మల రూపంలోనే ఉండాలని కోరుకుంటారు. అందుకే వారు తినే ప్లేట్ల దగ్గర్నుంచి.. పడుకునే మంచం దాకా.. ఇలా ప్రతిదీ వారికి నచ్చిన బొమ్మలు, ఆకృతుల్లో ఉండేవే ఎంచుకుంటుంటారు తల్లిదండ్రులు. ఇప్పుడు స్కూల్‌ బ్యాగులు కూడా ఆ లిస్టులో చేరిపోయాయి. పిల్లలెంతో ముచ్చటపడేలా విభిన్న ఆకృతుల్లో, బొమ్మల రూపంలో తయారుచేసిన బ్యాగ్స్‌ ప్రస్తుతం మార్కెట్లో కొలువు తీరాయి.

కారు, టైర్‌, కార్టూన్లు, డోనట్‌తో పాటు పిల్లలు ఆడుకునే టాయ్‌ బాక్స్‌ తరహాలో రూపొందించినవి, రాకెట్‌ ఆకృతిని పోలి ఉన్నవి, కోడిగుడ్డు ఆకృతిలో తయారుచేసినవి, డైనోసార్‌ వంటి జంతువుల థీమ్‌తో రూపొందించినవి.. ఇలా చెప్పుకుంటూ పోతే విభిన్న రకాల స్కూల్‌ బ్యాగ్స్‌ చిన్నారులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కిండర్‌ గార్టన్‌కు వెళ్లే పిల్లలకు ఇవి మరింత ఉపయుక్తం. పైగా వీటి తయారీలో వాటర్‌ప్రూఫ్‌ మెటీరియల్‌ వాడడం వల్ల వర్షానికి అందులోని పుస్తకాలు, ఇతర వస్తువులు తడిసిపోతాయన్న దిగులే అక్కర్లేదు. అంతేకాదు.. ఈ తరహా బ్యాగులు చిన్నారులకు అందాన్నీ తీసుకొస్తాయి. మరి, అలాంటి స్కూల్‌ బ్యాగ్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!

Photos: Amazon.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని