బ్యాగుపై పౌడరు చల్లండి...

కాస్త ఖరీదు ఎక్కువ పెట్టి హ్యాండుబ్యాగు కొంటున్నప్పుడు.. దాని రంగూ, డిజైను చూడటం ఒక్కటే కాదు.. అది ఎక్కువకాలం మన్నాలంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

Updated : 09 Dec 2022 15:22 IST

కాస్త ఖరీదు ఎక్కువ పెట్టి హ్యాండుబ్యాగు కొంటున్నప్పుడు.. దాని రంగూ, డిజైను చూడటం ఒక్కటే కాదు.. అది ఎక్కువకాలం మన్నాలంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

* బ్యాగుపై జిడ్డు మరకలు పడ్డాయా.. పిల్లల ఒంటికి రాసే పౌడర్‌ని దానిపై వేసి ఓ రాత్రంతా వదిలేయండి. మర్నాడు ఓసారి దులిపి తుడిచేస్తే చాలు. మరకలు సులువుగా పోతాయి.

* మురికి పట్టి.. బ్యాగు పాతదానిలా కనిపిస్తుంటుంది కొన్నిసార్లు. అలాంటప్పుడు ఎండిపోయిన బ్రెడ్‌స్లైసు ఉంటుంది కదా.. దాన్ని తీసుకుని తుడిచి చూడండి. మురికి సులువుగా వదిలి.. కొత్తగా కనిపిస్తుంది.

* మీరు వాడే అలంకరణ సామగ్రికోసం విడిగా చిన్న సంచిలాంటిదాన్ని పెట్టుకోండి తప్ప వాటిని లెదర్‌ బ్యాగులో వేయకండి. వాటి మూతలు వదులైపోతే.. అవన్నీ బ్యాగులో ఒలికి మరకలు పడతాయి. ఓ పట్టాన పోవు కూడా. ఒకవేళ బ్లష్‌ లాంటిది ఒలికితే అలంకరణ తుడిచే టిష్యూతో తుడిచేయండి.

* అతి వేడి, చల్లదనం, తేమ ఉన్న గదిలో బ్యాగుని పెడితే గనుక దాని రంగు పోయి.. పాతదానిలా మారుతుంది. అవసరం లేనప్పుడు దాన్నో దిండుగలేబులో ఉంచి.. అల్మారాలో ఓ మూల భద్రపరిస్తే చాలు.

* మీ బ్యాగు ఆకృతి బాగుండాలంటే.. దాన్ని అవసరానికి మించిన వస్తువులో నింపేయకండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని