మెరిపించే బార్లీ..!

శరీరం చక్కగా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉండాలని అందరికీ ఉంటుంది.. కానీ మచ్చలు, మొటిమలు, జిడ్డు చర్మం.. ఇలా ఎన్నో సమస్యలు. ఇలాంటి వాటన్నింటికీ చెక్ పెడుతుంది ఈ బార్లీ ఫేషియల్....

Published : 14 Jul 2023 13:17 IST

శరీరం చక్కగా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉండాలని అందరికీ ఉంటుంది.. కానీ మచ్చలు, మొటిమలు, జిడ్డు చర్మం.. ఇలా ఎన్నో సమస్యలు. ఇలాంటి వాటన్నింటికీ చెక్ పెడుతుంది ఈ బార్లీ ఫేషియల్!

కావాల్సినవి

బార్లీ గింజల పొడి - రెండు చెంచాలు

గోరువెచ్చటి నీళ్లు - సరిపడా

తయారీ విధానం

ముందుగా ఒక పాత్రలో బార్లీ గింజల పొడిని తీసుకుని అందులో కొద్దికొద్దిగా గోరువెచ్చటి నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి.

ఫేషియల్ ఇలా!

ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని చర్మంపై నల్ల మచ్చలు ఉన్న చోట పూసి ఓ పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రంగా కడిగేసుకుని మెత్తని గుడ్డతో తుడుచుకుంటే సరిపోతుంది. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే చర్మంపై ఉండే మచ్చలు, మృత కణాలు.. తొలగిపోయి చర్మం నాజూగ్గా, ప్రకాశవంతంగా తయారవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని