కంటి చుట్టూ మచ్చలు.. ఎలా పోతాయి?

మా అమ్మ గారికి కంటి చుట్టూ, ముక్కు మీద మంగు మచ్చలు ఏర్పడ్డాయి. అవి ఏవైనా క్రీమ్స్‌ వాడితే పోతాయా? లేదంటే ఇంట్లోనే పాటించే చిట్కా ఏదైనా ఉందా? - ఓ సోదరి

Published : 06 Jul 2024 13:10 IST

మా అమ్మ గారికి కంటి చుట్టూ, ముక్కు మీద మంగు మచ్చలు ఏర్పడ్డాయి. అవి ఏవైనా క్రీమ్స్‌ వాడితే పోతాయా? లేదంటే ఇంట్లోనే పాటించే చిట్కా ఏదైనా ఉందా? - ఓ సోదరి

జ. మీరు క్రీమ్స్‌ వాడాలనుకుంటే డెర్మటాలజిస్ట్‌ దగ్గరకు వెళ్లచ్చు. లేదనుకుంటే ఇంటి చిట్కాలను కూడా ప్రయత్నించవచ్చు.

ఇంటి చిట్కా 

ముందుగా ఒక టేబుల్‌ స్పూన్ కలబంద గుజ్జు తీసుకోవాలి. దానికి సమానమైన పరిమాణంలో అంటే టేబుల్‌ స్పూన్‌ రోజ్‌ వాటర్ కలపాలి. ఆ తర్వాత రెండు చుక్కల నిమ్మరసాన్ని కలపాలి. ఈ మూడింటినీ మిక్స్‌ చేసి ఎక్కడ మంగు మచ్చలున్నాయో అక్కడ అప్లై చేయాలి. ఒక పది నిమిషాల తర్వాత మసాజ్‌ చేసుకొని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వల్ల ఫలితం ఉంటుంది.

అయితే ఈ చిట్కా పాటిస్తున్నప్పుడు శరీరానికి ఎండ తగలకుండా చూసుకోవాలి. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే స్కార్ఫ్ ధరించాలి. అలాగే హెయిర్‌ డై లాంటివి ఉపయోగించకూడదు. ఒకవేళ తప్పనిసరిగా వేసుకోవాలనుకున్నప్పుడు మంగు మచ్చలపై ఏదైనా మాయిశ్చరైజర్‌ని అప్లై చేయాలి. మాయిశ్చరైజర్‌ లేనప్పుడు పాల మీగడను ఉపయోగించవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్