డెలివరీ తర్వాత ముఖం మీద నల్ల మచ్చలు.. తగ్గేదెలా?

నాకు పాతికేళ్లు. బాబు పుట్టి ఏడాదవుతోంది. నేను గర్భంతో ఉన్నప్పుడు నా ముఖం మీద నల్ల మచ్చలొచ్చాయి. ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వాటిని ఎలా తగ్గించుకోవాలి? అలాగే నా ముఖం వయసు....

Published : 16 Jul 2023 14:20 IST

నాకు పాతికేళ్లు. బాబు పుట్టి ఏడాదవుతోంది. నేను గర్భంతో ఉన్నప్పుడు నా ముఖం మీద నల్ల మచ్చలొచ్చాయి. ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వాటిని ఎలా తగ్గించుకోవాలి? అలాగే నా ముఖం వయసు పైబడినట్లుగా కనిపిస్తోంది.. ఏం చేయాలి? - ఓ సోదరి

జ. మీరు ఈ సమస్యను ఇంటి చిట్కా ద్వారా పరిష్కరించుకోవచ్చు. దీనికోసం ఒక టేబుల్ స్పూన్ పాల మీగడ, అర టేబుల్ స్పూన్ బార్లీ పౌడర్, అర టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్ తీసుకొని అందులో నాలుగు చుక్కల తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగాల్లో ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. అలా ఒక 20 నిమిషాల పాటు ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి నాలుగుసార్లు చేస్తే రెండు నుంచి మూడు నెలల్లో చక్కటి ఫలితం కనిపిస్తుంది.

ఒకవేళ మీకు ఓట్స్ పౌడర్ అందుబాటులో లేకపోతే శెనగపిండిని కూడా కలుపుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని