అరటి తొక్కతో అందంగా!
ఆరోగ్యాన్నిచ్చే అరటిపండ్లతో ముఖ సౌందర్యాన్నీ పెంపొందించుకోవచ్చన్న సంగతి తెలిసిందే! అయితే వృథా అని తీసిపడేసే అరటి తొక్కతోనూ అందాన్ని ఇనుమడింపజేసుకోవచ్చన్ని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అదెలా సాధ్యమో తెలుసుకుందాం రండి..
ఆరోగ్యాన్నిచ్చే అరటిపండ్లతో ముఖ సౌందర్యాన్నీ పెంపొందించుకోవచ్చన్న సంగతి తెలిసిందే! అయితే వృథా అని తీసిపడేసే అరటి తొక్కతోనూ అందాన్ని ఇనుమడింపజేసుకోవచ్చన్ని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అదెలా సాధ్యమో తెలుసుకుందాం రండి..
అరటి తొక్కలో ‘బి6’, ‘బి12’ విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. అంతేకాదు ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి చర్మంపై ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి.
మాస్క్‌తో మెరుపు!
అరటి తొక్కలో చర్మ పోషణకు సహకరించే ఖనిజ లవణాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఒక అరటి పండు తొక్కను చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేయాలి. ఇందులో రెండు చిన్నగా కట్ చేసిన అరటి పండు ముక్కల్ని కూడా చేర్చి మిక్సీ పట్టుకోవాలి. ఆపై రెండు టేబుల్ స్పూన్ల పాలు కలిపి మళ్లీ గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆపై బయటకు తీసి ముఖం, మెడ భాగాల్లో అప్లై చేసుకోవాలి. అరగంట పాటు ఉంచుకొని ఆ తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా తరచుగా చేస్తుంటే చర్మం మెరుపును సంతరించుకుంటుంది.
మృతకణాలు పోవాలంటే..!
మృతకణాలు, జిడ్డుదనం.. ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంటాయి. ఇలాంటప్పుడు అరటితొక్కతో ముఖాన్ని, మెడను నెమ్మదిగా, మృదువుగా రుద్దుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఇలా పది నిమిషాల పాటు రుద్దుకున్నాక.. అరగంట పాటు అలాగే ఉంచుకొని చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల క్రమంగా మృతకణాలు తొలగిపోతాయి.. జిడ్డుదనమూ తగ్గుతుంది. అంతేకాదు.. చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించే కొలాజెన్‌ని ఉత్పత్తి చేయడంలో అరటితొక్క సమర్థంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. చర్మాన్ని బిగుతుగానూ మార్చుతుంది. తద్వారా వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా నవయవ్వనంగా మెరిసిపోవచ్చు.
కళ్ల కింద వలయాలా?
ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ని ఎక్కువ సేపు ఉపయోగించడం, పని ఒత్తిడి, నిద్రలేమి.. వీటి ప్రభావం కళ్ల పైనే నేరుగా పడుతుంది. తద్వారా కళ్లు అలసిపోయి ఉబ్బడం, కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడడం.. వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలా కంటి సమస్యలు కూడా అందాన్ని దెబ్బతీస్తాయి. అయితే వీటి నుంచి విముక్తి పొందాలంటే అది అరటి తొక్కతోనే సాధ్యమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కంటి కింద పెట్టుకునేలా చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు అరటి తొక్కల్ని పావుగంట పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆపై వాటిని కళ్ల కింద పెట్టుకొని అరగంట పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే కంటి సమస్యలన్నీ తొలగిపోయి.. అటు కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.. ఇటు అందంగానూ కనిపించేయచ్చు.
మెరిసే పలువరుస!
తళతళ మెరిసే దంతాలు అందాన్ని ఇనుమడిస్తాయి. అయితే మన ఆహారపుటలవాట్లు, నోటి శుభ్రత లోపించడం వల్ల అవి పసుపు రంగులోకి మారడం, చిగుళ్లలో వాపు.. వంటి దంత సమస్యలు ఎదురవుతాయి. మరి, వాటన్నింటికీ చెక్ పెట్టి మెరిసే పలువరుసను సొంతం చేసుకోవాలంటే అరటి తొక్కతో కాసేపు దంతాలపై రుద్దితే సరి! ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దంత సమస్యల్ని దూరం చేస్తాయి. ఈ చిట్కాను వారం పాటు రోజూ పాటిస్తే పళ్లు మేలిమి మెరుపును సొంతం చేసుకుంటాయి.
చుండ్రును తగ్గిస్తుంది!
ముఖ సౌందర్యానికే కాదు.. జుట్టు ఆరోగ్యానికీ అరటితొక్క మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా చుండ్రు సమస్య నుంచి ఇది విముక్తి కలిగిస్తుందట! ఇందుకోసం అరటి తొక్క లోపలి లేయర్‌ని స్పూన్ సహాయంతో తీసి.. దీనికి కొన్ని కొబ్బరి పాలు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆపై ఇందులో టేబుల్‌స్పూన్ చొప్పున పెరుగు, కొబ్బరి నూనెతో పాటు కొద్దిగా తేనె కూడా కలుపుకొని మిశ్రమంగా తయారుచేసుకోవాలి. ఈ హెయిర్మాస్క్ను కుదుళ్లు, జుట్టుకు పట్టించి అరగంట పాటు ఉంచుకొని ఆపై తలస్నానం చేసేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల చుండ్రు సమస్య నుంచి విముక్తి పొందచ్చు.
ఇవి కూడా!
* ప్రతిరోజూ 10 నిమిషాల పాటు అరటితొక్కతో పెదాల్ని మృదువుగా మర్దన చేయడం వల్ల.. అవి మృదువుగా మారతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు పెదాలపై వాపును తగ్గించడంలో తోడ్పడతాయి.
* అరటితొక్కలో పొటాషియం, తేమ నిండి ఉంటాయి. ఇవి పొడిబారిన చర్మానికి తేమనందించి మృదువుగా మార్చడంలో సహకరిస్తాయి.
* మొటిమల సమస్యకు అరటి తొక్క చక్కటి పరిష్కారం చూపుతుందని చెబుతున్నారు నిపుణులు. ఈ తొక్కతో కాసేపు ముఖంపై రుద్దుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు.
* అరటి తొక్కతో కుదుళ్లకు మర్దన చేయడం వల్ల అందులోని సిలికా కుదుళ్ల చర్మంలోకి ఇంకి కొలాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది.
* ఒత్తిడి ప్రభావం జుట్టు పైనా పడుతుంది. తద్వారా చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడం, నిర్జీవమైపోవడం.. వంటి సమస్యలొస్తాయి. వీటికి చెక్ పెట్టాలంటే అరటి తొక్కతో కుదుళ్లను మర్దన చేయడమే సరైందని చెబుతున్నారు నిపుణులు. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కుదుళ్లలోకి ఇంకి వాటిని దృఢంగా మార్చుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!