Published : 10/01/2022 21:20 IST

క్యాలమైన్‌తో కళ్లు చెదిరే అందం..!

అందం కోసం వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులు ఉపయోగించడం మనలో చాలామందికి అలవాటే..! అయితే వీటిలో కొన్ని ఉత్పత్తులు చర్మాన్ని తాత్కాలికంగా అందంగా కనిపించేలా చేస్తే.. మరికొన్ని మాత్రం మన అందాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. క్యాలమైన్‌ లోషన్‌ రెండు విధాలుగా పనిచేస్తూ.. చర్మ ఛాయను ఇనుమడిస్తుంది.

మొటిమలకు చెక్

క్యాలమైన్ లోషన్‌లో జింక్ ఆక్సైడ్, ఫెర్రస్ ఆక్సైడ్ వంటి చర్మానికి హాని కలిగించని రసాయనాలు మాత్రమే ఉంటాయి. అంతేకాదు.. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను సైతం నాశనం చేస్తాయి. అందుకే మొటిమల సమస్య ఎక్కువగా ఉన్నవారు ఈ లోషన్‌ని తరచూ ఉపయోగించడం వల్ల సమస్య తగ్గుముఖం పడుతుంది. అలాగే దీన్ని రోజూ ఉపయోగిస్తే చర్మంపై ఉండే నల్లమచ్చలు కూడా తగ్గుతాయి.

మృతకణాలు మాయం

మృతకణాల్ని ఎప్పటికప్పుడు తొలగించకపోతే.. మొటిమలు, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్.. వంటి సమస్యలు తలెత్తుతాయి. రోజూ క్యాలమైన్ లోషన్ రాసుకోవడం ద్వారా మృతకణాల్ని చాలా వరకు తొలగించుకోవచ్చు. అదెలాగంటే.. ఈ లోషన్ రాసుకున్నప్పుడు అది చర్మానికి అంటుకుపోయి తిరిగి మనం ముఖం కడుక్కున్నప్పుడు మృతకణాలతో సహా తొలగిపోతుంది. కాబట్టి క్యాలమైన్ లోషన్‌తో వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, అలర్జీలు.. వంటి చర్మ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టచ్చంటున్నారు నిపుణులు.

జిడ్డు దూరం!

కాలమేదైనా కొంతమంది చర్మం జిడ్డుగా మారుతుంటుంది. అయితే క్యాలమైన్ లోషన్‌ని రోజూ రాసుకోవడం ద్వారా చర్మ కణాల్లో సీబమ్‌ ఉత్పత్తి బ్యాలన్స్‌ అయి.. తద్వారా ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది. ఫలితంగా చర్మం తాజాగా కనిపిస్తుంది.
ఫౌండేషన్‌గానూ..!

మనం తరచూ వేసుకునే మేకప్ లుక్ మొత్తం ఫౌండేషన్‌పైనే ఆధారపడి ఉంటుంది. అంటే ఫౌండేషన్ సరిగ్గా ఉంటేనే మేకప్ లుక్ ఇనుమడిస్తుందని అర్థం. అందుకే సరైన మేకప్ లుక్ అందించే ఫౌండేషన్‌గా ఈ క్యాలమైన్ లోషన్‌ని ఉపయోగించచ్చంటున్నారు నిపుణులు. అంతేకాదు.. మేకప్‌లోని పదార్థాల వల్ల చర్మానికి ఎలాంటి హాని కలగకుండా ఈ లోషన్‌ సహకరిస్తుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని