Published : 14/11/2022 21:58 IST

చర్మ సంరక్షణకూ ఇది కావాలి!

మీకు తెలుసా.. బొగ్గు (యాక్టివేటెడ్‌ చార్‌కోల్‌)ను సైతం చర్మ సంరక్షణకు ఉపయోగించొచ్చని! దీంతో వేసుకునే కొన్ని పూతలు చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా మారుస్తాయి. అవేంటో చూసేద్దామా..

⚛ వాతావరణంలో ఉండే దుమ్మూ-ధూళి చర్మంపై చేరడం వల్ల స్వేద రంధ్రాలు మూసుకుపోయే అవకాశం ఉంటుంది. తద్వారా అవి మరింత పెద్దగా కనిపిస్తాయి. అందుకే మీ ఫేస్‌ మాస్క్‌లో కొద్దిగా బొగ్గుపొడిని ఉపయోగిస్తే అది మృతకణాలను తొలగిస్తుంది. మురికి బయటకు వచ్చేలా చేస్తుంది.

⚛ కాలమేదైనా చాలామందిని జిడ్డు చర్మం ఇబ్బంది పెడుతుంటుంది. ఇలాంటి వారు యాక్టివేటెడ్‌ చార్‌కోల్‌తో తయారుచేసిన మాస్క్‌ క్లెన్సర్‌ని వాడితే అతిగా విడుదలయ్యే నూనెలు తొలగిపోతాయి. చర్మం మృదువుగానూ మారుతుంది. అలాగే ఈ మాస్క్‌ క్లెన్సర్‌ చర్మం సహజ నూనెల్ని కోల్పోకుండా చేస్తుంది కూడా!

⚛ శరీరానికి ఏవైనా గాయాలైనప్పుడు కొన్ని రోజులకు అక్కడ ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది. బొగ్గుపొడిలో కాసిన్ని నీళ్లు కలిపి మిశ్రమంలా చేయాలి. గాయాలు, ఇన్ఫెక్షన్‌ వచ్చిన చోట దీన్ని పూతలా వేస్తే ఫలితం ఉంటుంది. వాపు కూడా తగ్గుతుంది.

⚛ దంతాలు పచ్చగా కనిపిస్తున్నాయా? అయితే కొద్దిగా బొగ్గుపొడిలో వంటసోడా కలిపి ఈ మిశ్రమంతో వారానికోసారి తోముకుంటే ముత్యాల్లా మెరుస్తాయట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని