Published : 17/02/2022 20:53 IST

ఆ నలుపు తగ్గాలంటే..!

ఎక్కువ సేపు బయట తిరిగినప్పుడు ఎండ ప్రభావం వల్ల ముఖం, చేతులు, పాదాలు నల్లగా మారతాయి. అలాంటప్పుడు ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఆ నలుపు ఎలా వదిలించుకోవాలో చూద్దాం..

* రెండుమూడు చెంచాల పెరుగులో కొద్దిగా పసుపు కలపాలి. ఐదు నిమిషాలయ్యాక ఈ మిశ్రమాన్ని చేతులకు రాసి మర్దన చేయాలి. ఇది పూర్తిగా ఆరాక కడిగేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా కనీసం రెండు వారాలు రాసుకొని చూడండి. నలుపు తగ్గుతుంది.

* ఒక పెద్ద పాత్రలో గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో రెండు నిమ్మకాయల రసం కలపాలి. ఆ నీటిలో ఓ అరగంట పాటు పాదాలు ఉంచాలి. నలుపు సమస్య ఎక్కువగా ఉందనుకుంటే నిమ్మరసాన్ని నీళ్లలో కలపకుండా నేరుగా పాదాలకే రాసుకోవచ్చు. ముఖ్యంగా మోచేతి నలుపు తగ్గించడానికి ఈ చిట్కా చక్కగా పనిచేస్తుంది.

* రెండు చెంచాల కీరదోస రసంలో, ఒక చెంచా నిమ్మరసం, చిటికెడు పసుపు కలపాలి. దీన్ని చేతులకు పట్టించి, ఆరిపోయాక కడిగేయాలి. దీనికి బదులుగా సమస్య ఉన్న ప్రాంతంలో తాజా కీరదోస ముక్కలతో కూడా మర్దన చేసుకోవచ్చు.

* ముఖం నల్లగా మారితే శెనగపిండి పూత ప్రయత్నించి చూడండి. రెండు పెద్ద చెంచాల శెనగపిండిలో చిటికెడు పసుపు, ఒక చెంచా పాలు కలపాలి. కావాలనుకుంటే ఇందులో కొన్ని గులాబీ నీళ్లు కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకొని పూర్తిగా ఆరిపోయాక చల్లని నీళ్లతో కడిగేసుకుంటే ఫలితం ఉంటుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని