Published : 08/12/2022 22:06 IST

చర్మ సంరక్షణకు తులసి..!

మచ్చలేని సౌందర్యాన్ని సొంతం చేసుకోవడానికి మార్కెట్లో లభించే వివిధ సౌందర్య ఉత్పత్తులే కాదు.. సహజసిద్ధమైన పదార్థాలు కూడా ఉపయోగపడతాయి. మన ఇంట్లో ఉండే తులసి ఆకులు కూడా ఇదే కోవకు వస్తాయంటున్నారు నిపుణులు.

మొటిమలకు..

తాజా తులసి ఆకులను తినడం వల్ల మొటిమలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. తాజా ఆకులను మెత్తగా చేసుకొని మొటిమలపై రాసినా ఫలితం ఉంటుంది. తులసి ఆకులను నీటిలో ఉడికించి చల్లార్చి ఆ ద్రావణాన్ని టోనర్‌గా కూడా వాడుకోవచ్చు. దీనివల్ల మొటిమలు తగ్గడమే కాదు ముఖచర్మం కాంతివంతంగా కూడా తయారవుతుంది. తులసి పొడిని రోజ్‌వాటర్‌తో కలిపి ముఖానికి పట్టిస్తే చర్మరంధ్రాలు తెరుచుకొని మొటిమలు, ఇతర చర్మ సంబంధ సమస్యలు తగ్గుతాయి. అదేవిధంగా తులసి ఆకుల రసానికి పుదీనా ఆకుల రసం కలిపి ముఖానికి పట్టిస్తే మొటిమల నుంచి ఉపశమనం కలుగుతుంది.

నల్లమచ్చల నివారణకు..

ముఖంపై నల్లని మచ్చలను నివారించడంలో తులసి బాగా పని చేస్తుంది. తులసి ఆకుల రసానికి అంతే మోతాదులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా రోజుకు ఒకసారి చేయడం వల్ల ముఖంపై ఉన్న నల్లమచ్చలు తగ్గడంతో పాటు చర్మం కాంతివంతంగా మారుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని