పండగయ్యాక మొటిమలా?

పండగ హడావుడి ముగిసింది. అందంగా కనిపించాలని కాస్త మేకప్‌ టచ్‌ ఇచ్చుంటారు. ఆ తర్వాతే చాలామందిలో దిగులు.. ఎక్కడ మొటిమలు వచ్చేస్తాయోనని! మీదీ అదే సమస్యా? ఈ తప్పులు చేస్తున్నారేమో చెక్‌ చేసుకోమంటున్నారు నిపుణులు! పగలంతా పండగ హడావుడి. సాయంత్రానికి ఓపిక తగ్గిపోతుంది.

Published : 23 Mar 2023 00:10 IST

పండగ హడావుడి ముగిసింది. అందంగా కనిపించాలని కాస్త మేకప్‌ టచ్‌ ఇచ్చుంటారు. ఆ తర్వాతే చాలామందిలో దిగులు.. ఎక్కడ మొటిమలు వచ్చేస్తాయోనని! మీదీ అదే సమస్యా? ఈ తప్పులు చేస్తున్నారేమో చెక్‌ చేసుకోమంటున్నారు నిపుణులు!

పగలంతా పండగ హడావుడి. సాయంత్రానికి ఓపిక తగ్గిపోతుంది. దీంతో మేకప్‌ తొలగించకపోవడమో.. హడావుడిగా స్నానం ముగించేయడమో చేశారా? మేకప్‌ ఉత్పత్తుల తాలూకా అవశేషాలు చర్మంలో మిగిలిపోయి మొటిమలు, దద్దుర్లకు దారితీస్తాయి. కాబట్టి, డబుల్‌ క్లెన్సింగ్‌ తప్పక చేయాలి.

మేకప్‌ వేసుకునే ముందు చేతులు శుభ్రం చేసుకున్నారా? ఏవో పనులు చేసుకుని అవే  చేతులతో మేకప్‌ వేసుకున్నా దుమ్మూధూళి చర్మరంధ్రాల్లోకి వెళ్లిపోతాయి. కాబట్టి, మేకప్‌కు ముందు గుర్తుంచుకొని మరీ చేతులు శుభ్రం చేసుకోవడం మరచిపోవద్దు. బ్రష్‌లతో వేసుకోవడం అలవాటైతే.. వాటినీ ముందురోజే శుభ్రం చేసుకొని దుమ్మూధూళి అంటని ప్రదేశంలో భద్రపరచుకోవాలి.

మనలో చాలామందికి రోజూ మేకప్‌ వేసుకునే అలవాటు తక్కువే. సందర్భానికి పనికొస్తాయని కొని పక్కన పెడుతుంటాం. వాడకుండా ఉంచినంత మాత్రాన పాడవవని అర్థం కాదు కదా! ఎప్పటికప్పుడు తుది గడువు చెక్‌ చేసుకోవాలి. గడువు ముగిసినవి చర్మానికి చేటు చేయగలవు.

పండగలు, వేడుకలప్పుడు మేకప్‌ సామగ్రి పంచుకోవడం మామూలే! బ్రష్‌లు, పఫ్‌ వంటివీ పంచుకుంటున్నారా? అదే వద్దు. అవతలి వారికి మొటిమలు వంటివి ఉన్నా.. చర్మం సరిగా శుభ్రపరచుకోకపోయినా మీకే సమస్య.

ముఖం అందంగా కనిపించడానికి మచ్చలను కనిపించకుండా చేయాలనుకోవడం మామూలే! అయితే, మొటిమలనీ కప్పే ప్రయత్నం చేస్తే మాత్రం... ఇది సమస్యను మరింత పెద్దది చేయగలదు. దానిపై మాయిశ్చరైజర్‌, మొటిమలు తగ్గించే క్రీములు రాశాకే.. మేకప్‌ వేయండి. కడిగిన ముఖంపై నేరుగా మేకప్‌ ప్రయత్నించడమూ మంచిది కాదు. మాయిశ్చరైజర్‌, సన్‌స్క్రీన్‌ వంటివి రాశాకే ముందుకెళ్లాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్