Published : 26/12/2022 20:51 IST

క్యారట్‌తో కాంతులీనే చర్మం..!

క్యారట్- కొందరు బాగా ఇష్టంగా తింటారు.. మరికొందరు కష్టంగా తింటారు. దీనివల్ల అటు ఆరోగ్యపరంగానే కాకుండా ఇటు సౌందర్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ 'ఎ', యాంటీఆక్సిడెంట్లు.. మొదలైనవన్నీ చర్మ సౌందర్యానికి దోహదం చేస్తాయి. ఇన్ని సుగుణాలున్న క్యారట్‌ను ఉపయోగించి వివిధ రకాల ఫేస్‌ప్యాక్స్, మాస్క్స్.. ఇలా చర్మ సౌందర్యం ఇనుమడించడానికి రకరకాల చిట్కాలు పాటించవచ్చు. సహజసిద్ధంగా లభించే క్యారట్‌ను, ఇంట్లో అందుబాటులో ఉండే ఇతర వస్తువులతో కలిపితే పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే మైమరిపించే అందాన్ని సొంతం చేసుకోవచ్చు.

పాలు, క్యారట్ ఫేస్ ప్యాక్

పాడవకుండా ఉండటానికి సహాయపడతాయి. ఫలితంగా వార్థక్యపు ఛాయలు అంత తొందరగా దరి చేరకుండా ఉంటాయి. అలా ఉపకరించే ఫేస్‌ప్యాక్స్‌లో ఇది కూడా ఒకటి.

కావాల్సినవి:

క్యారట్- 1

పచ్చిపాలు- 1 టేబుల్ స్పూన్

తేనె- 1 టేబుల్ స్పూన్

తయారీ:

క్యారట్‌ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఉడికించుకోవాలి. తర్వాత మెత్తని మిశ్రమంలా చేయాలి. ఈ మిశ్రమం చల్లారాక దానికి పచ్చిపాలు, తేనె జత చేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖ చర్మానికి తేమ అందడంతో పాటు, పాలు చర్మంలో పేరుకుపోయిన మురికిని తొలగించి మచ్చలు లేకుండా చేస్తాయి.


క్యారట్, తేనెతో..

శరీరంలో పొటాషియం లోపిస్తే చర్మం ఎక్కువగా పొడి బారుతుంది. ఫలితంగా ముఖం నిర్జీవంగా మారుతుంది. దీన్ని నివారించాలంటే పొటాషియం అధికంగా లభించే క్యారట్‌ని ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే ఈ ఈ ఫేస్ ప్యాక్‌ను కూడా ప్రయత్నించవచ్చు.

కావాల్సినవి:

క్యారట్- 3

తేనె- 2 టేబుల్ స్పూన్స్

ఆలివ్ ఆయిల్- 1 టేబుల్ స్పూన్

నీళ్లు- కలపడానికి సరిపడా.

తయారీ:

ముందుగా క్యారట్‌ని తొక్క తీసేసి బాగా ఉడికించాలి. తర్వాత ఉడికిన క్యారట్‌ని మెత్తని గుజ్జులా చేసుకోవాలి. ఇప్పుడు అందులో తేనె, ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఒకవేళ ఈ మిశ్రమం బాగా గట్టిగా ఉన్నట్లనిపిస్తే కొద్దిగా నీళ్లు జత చేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవడానికి వీలుగా ఉండేలా చూసుకోవాలి. అయితే ఈ ప్యాక్ అప్త్లె చేసే ముందు గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఫలితంగా చర్మ గ్రంథులు తెరుచుకుంటాయి. ఇప్పుడు ఈ ప్యాక్‌ని అప్త్లె చేసుకుని 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. కాసేపటికి ఫేస్ ప్యాక్ ఆరి పొరలా వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్లీ గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే సరి. ఇలా వారానికోసారి చేస్తే చర్మం కాంతులీనడం ఖాయం. ఇందులో క్యారట్ చర్మ సౌందర్యానికి ఉపకరిస్తే, ఆలివ్ ఆయిల్ పొడిబారిన చర్మానికి జీవాన్నిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని