Beauty Tips: కాటుక కన్ను దాటుతోంటే..

కడిగిన ముఖానికి మాయిశ్చరైజర్‌ రాసేప్పుడు కళ్ల కింది ప్రాంతాన్ని వదిలేయండి. తర్వాత ఒక టిష్యూతో కళ్ల చుట్టూ నూనెలు లేకుండా అద్దాలి.

Published : 01 May 2023 00:18 IST

* కడిగిన ముఖానికి మాయిశ్చరైజర్‌ రాసేప్పుడు కళ్ల కింది ప్రాంతాన్ని వదిలేయండి. తర్వాత ఒక టిష్యూతో కళ్ల చుట్టూ నూనెలు లేకుండా అద్దాలి. ఇయర్‌ బడ్‌ లేదా దూదితో కాటుక రాసే ప్రాంతాన్ని నెమ్మదిగా తుడిచి, అప్పుడు కాటుక రాస్తే సరి.

*స్మడ్జ్‌ ఫ్రీ రకాలు మార్కెట్‌లో బోలెడు. అవీ పని చేయడం లేదని వాపోయే అమ్మాయిలే ఎక్కువ. కనుల కింది భాగంలో కాంపాక్ట్‌ పౌడర్‌ని అద్దాక కాటుక రాసి చూడండి. ఫలితం ఉంటుంది.

* కాటుక అద్దే ముందు ప్రైమర్‌ను కళ్ల చుట్టూ రాయండి. కాటుక కరిగే సమస్య చాలావరకూ ఆగిపోతుంది.

* కాటుక ఎక్కువగా కనుమూలల్లోనే కరుగుతుంది. కాబట్టి, మూలల్లో పలుచగా.. మధ్యలో మందంగా ఉండేలా రాయండి. లుక్‌ బాగుంటుంది, కళ్ల నిండా అవుతుందన్న సమస్య ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్