Beauty tips: శరీరం కంటే.. ముఖం ఛాయ తక్కువ!

నాది పొడిచర్మం. ఏ క్రీములూ వాడ ను. శరీరం కంటే ముఖం ఛాయ తక్కువగా కనిపిస్తోంది. నిర్జీవంగా మారింది. ఏం చేయాలి?

Published : 28 May 2023 00:22 IST

నాది పొడిచర్మం. ఏ క్రీములూ వాడ ను. శరీరం కంటే ముఖం ఛాయ తక్కువగా కనిపిస్తోంది. నిర్జీవంగా మారింది. ఏం చేయాలి?

- ఓ సోదరి

మామూలు వాళ్లకంటే పొడిచర్మం ఉన్నవారు ఎండకి ఎక్కువ నల్లబడతారు. ఒక్కోసారి వంశపారం పర్యంగానూ కొందరిలో శరీరం కంటే ముఖం ఛాయ తక్కువగా కనిపిస్తుంది. క్రీములు వాడనంటున్నారు కాబట్టి.. ఎండ ప్రభావం ఎక్కువే ఉంటుంది. మాయిశ్చరైజర్‌, సన్‌స్క్రీన్‌ లోషన్‌ని స్కిన్‌ కేర్‌ రొటీన్‌లో తప్పనిసరి చేసుకోండి. శరీరంలాగే చర్మానికీ పోషకాలు కావాలి. అందుకే పగలు లాక్టిక్‌ యాసిడ్‌, సెరమైడ్స్‌, షియాబటర్‌, హైలురోనిక్‌ యాసిడ్‌, బి5, అలిగో పెప్టైడ్స్‌, జొజొబా ఆయిల్‌ ఉన్న క్రీములు వాడండి. దాంతోపాటు కనీసం 30 ఎస్‌పీఎఫ్‌ ఉన్న సన్‌స్క్రీన్‌నీ రాయడం మొదలుపెట్టండి. రసాయనాలు, కృత్రిమ సువాసనలుండే సబ్బులను పక్కన పెట్టి, మైల్డ్‌ క్లెన్సర్‌, లిక్విడ్‌ బాడీవాష్‌లను ఉపయోగించడం మంచిది. 30ల్లోకి వస్తోంటే.. చర్మం సాగడం, ముడతలు, గీతల సమస్యలూ మొదలవుతాయి. కాబట్టి, రాత్రి.. విటమిన్‌ ఎ, రెటినాల్‌, ఆల్ఫాహైడ్రాక్సీ యాసిడ్‌లు ఉన్న క్రీములు రాసుకోండి. వీటితోపాటు ఆల్కహాల్‌లేని, హైడ్రేట్‌ చేసే టోనర్‌నీ చేర్చుకుంటే ఇంకా మంచిది. మల్టీవిటమిన్‌ మాస్క్‌లను వారానికి రెండుసార్లు తప్పక వేసుకోవాలి. సహజంగా ప్రయత్నించాలనుకుంటే.. కలబంద, ఆలివ్‌నూనె వంటివీవీ రాసుకోవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఎక్కువ నీళ్లు తాగండి. రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్‌, కార్బోహైడ్రేట్లు అందేలా చూసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్