Beauty tips: అరటిలో అందం!

ముఖంపై మొటిమల కారణంగా నల్ల మచ్చలా? విటమిన్లు, పోషకాలు నిండిన అరటితో వాటికి మంత్రం వేయండి. చర్మానికి పోషణ అందడంతోపాటు సమస్యా దూరమవుతుంది. పండిన అరటి పండును తొక్కతో సహా మెత్తగా చేయాలి.

Published : 31 May 2023 00:23 IST

ముఖంపై మొటిమల కారణంగా నల్ల మచ్చలా? విటమిన్లు, పోషకాలు నిండిన అరటితో వాటికి మంత్రం వేయండి. చర్మానికి పోషణ అందడంతోపాటు సమస్యా దూరమవుతుంది.

పండిన అరటి పండును తొక్కతో సహా మెత్తగా చేయాలి. ఈ గుజ్జుకు ఐదారు వేపాకులను కలిపి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమానికి కొంచెం పసుపు కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసి, ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు సమృద్ధిగా ఉండటం వల్ల మొటిమలను నివారిస్తుంది. మచ్చలు పోయి నిగారించేలా చేస్తుంది.

అరటిపండును గుజ్జుగా చేసి అందులో రెండు స్పూన్ల పెరుగు వేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసి 20 నిమిషాలయ్యాక నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో ముఖం మృదువుగా, నల్లమచ్చలు లేకుండా యౌవ్వనంగా కనిపిస్తుంది. ఇందులోని లాక్టిక్‌ యాసిడ్‌ ఎటువంటి చర్మ సమస్యలనైనా దూరం చేస్తుంది.  

అరటిగుజ్జులో స్పూన్‌ నిమ్మ రసం, చెంచా తేనె కలపాలి. ఈ ప్యాక్‌ను ముఖానికి రాసి, పావు గంటయ్యాక గోరువెచ్చని నీటితో కడిగితే చాలు. దీనిలోని సిట్రిక్‌ యాసిడ్‌ ముఖంపై జిడ్డును తొలగించి తాజాగా ఉండేలా మారుస్తుంది. ఏ, బీ, సీ విటమిన్లు, ఐరన్‌, మెగ్నీషియం, కాల్షియం మొదలైనవి నల్లమచ్చలను తొలగిస్తాయి. మొటిమల బెడదా ఉండదు.

అరటిలోని విటమిన్‌ సి మచ్చలను దూరం చేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలకు కారణం అయ్యే బ్యాక్టీరియాను నశింపజేస్తాయి. ఫైౖటో న్యూట్రియంట్లు చర్మాన్ని బిగుతుగా చేయడమే కాదు.. గీతలు, ముడతలు వంటివి రాకుండానూ చేస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని