అందాన్ని లాక్‌చేద్దాం..!

స్కిన్‌కేర్‌... ప్రస్తుతం చాలామంది అమ్మాయిల రొటీన్‌లో ఇది భాగం. ఈ క్రమంలో అనేక రకాల క్రీములు వాడుతుంటాం కదా! అయితే, ప్రస్తుతం నడుస్తోంది మాత్రం గ్లూటాథయోన్‌ ఉత్పత్తుల ట్రెండే... చర్మాన్ని కాంతిమంతంగా చేయడంలో ఇదే కీలకం మరి...

Published : 01 Jun 2024 04:46 IST

స్కిన్‌కేర్‌... ప్రస్తుతం చాలామంది అమ్మాయిల రొటీన్‌లో ఇది భాగం. ఈ క్రమంలో అనేక రకాల క్రీములు వాడుతుంటాం కదా! అయితే, ప్రస్తుతం నడుస్తోంది మాత్రం గ్లూటాథయోన్‌ ఉత్పత్తుల ట్రెండే... చర్మాన్ని కాంతిమంతంగా చేయడంలో ఇదే కీలకం మరి...

శరీరం సహజంగా ఉత్పత్తిచేసే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ గ్లూటాథయోన్‌. ఇందులోని అమైనో ఆమ్లాలు, శరీరానికి హానిచేసే ఫ్రీ ర్యాడికల్స్‌ను తటస్థపరిచి, వృద్ధాప్య ఛాయలు రాకుండా చూస్తాయి. అంతేకాదు, చర్మానికి మంచి ఛాయ వచ్చేలానూ చేస్తాయి.

ట్యాన్‌ తగ్గించి....

ఎన్ని సంరక్షణ పద్ధతులు పాటించినా సూర్యరశ్మి దాడి నుంచి తప్పించుకోవడం కష్టమే కదా! అసలే బయట ఎండలు మండిపోతున్నాయి. కాసేపు ఎండలో ఉన్నా సరే... అతినీల లోహిత కిరణాలు చర్మ కణాలను దెబ్బతీసి, ట్యాన్‌ ఏర్పరుస్తాయి. ఇలాంటప్పుడు గ్లూటాథయోన్‌ ఉండే క్రీముల్ని మనం ఎంపిక చేసుకుంటే, శరీరంలో టాక్సిన్లను తొలగించి, క్లియర్‌ చర్మాన్ని అందిస్తుంది. చర్మంపై రక్షణ కవచంలా ఏర్పడి యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది.

రిపేర్‌ చేసి...

వయసుపైబడే కొద్దీ చర్మం సాగే గుణాన్ని కోల్పోతుంది. అప్పుడూ మనకు ఉపయోగపడే మ్యాజిక్‌ క్రీము ఇదే. ఎందుకంటే, చర్మం ఎలాస్టిసిటీని కాపాడడంలో కొలాజెన్‌ పాత్ర కీలకం. శరీరంలో కొలాజెన్‌ తయారీకి గ్లూటాథయోన్‌ తోడ్పడుతుంది. చర్మాన్ని మృదువుగా, యవ్వనంగా మారుస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు మొటిమలు, ముడతలు, గీతలను తగ్గిస్తాయి.

పిగ్మెంటేషన్‌ను దూరంచేసి...

నల్లమచ్చలు, పిగ్మెంటేషన్‌ అమ్మాయిల అందానికి గొడ్డలిపెట్టే కదా! ఇలాంటివి తొలగించడమే దీని ప్రత్యేక లక్షణం మరి. మెలనిన్‌ ఉత్పత్తికి అంతరాయం కలిగించి, చర్మపు రంగు సమానంగా ఉండేలా చేస్తుంది. నల్ల మచ్చలను రూపుమాపుతుంది. ఇంకేం... అందాన్ని లాక్‌ చేసే ఈ ట్రిక్‌ని మనమూ పాటిద్దామా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్