దానివల్ల నా భర్తతో శారీరకంగా కలవలేకపోతున్నా..!

మా పెళ్లై ఆరేళ్లవుతోంది. నా భర్త వ్యక్తిగత శుభ్రత అస్సలు పాటించడు. మా దాంపత్యంలో ఇదే పెద్ద సమస్యగా మారింది. దీనివల్ల అతనితో శారీరకంగా కలవడానికి కూడా నిరాకరించే పరిస్థితికి వచ్చాను. నాకు పరిశుభ్రత పాటించే...

Published : 02 Jun 2023 10:33 IST

మా పెళ్లై ఆరేళ్లవుతోంది. నా భర్త వ్యక్తిగత శుభ్రత అస్సలు పాటించడు. మా దాంపత్యంలో ఇదే పెద్ద సమస్యగా మారింది. దీనివల్ల అతనితో శారీరకంగా కలవడానికి కూడా నిరాకరించే పరిస్థితికి వచ్చాను. నాకు పరిశుభ్రత పాటించే వారంటే ఇష్టం. కానీ నా భర్త దీనికి పూర్తి వ్యతిరేకం. చలికాలంలో అయితే ఏకంగా కొన్ని రోజుల పాటు స్నానం చేయడు. నేను భరించలేక ఒత్తిడి చేసినప్పుడు మాత్రమే స్నానం చేస్తుంటాడు. పెళ్లైన కొత్తలో అతన్ని పెర్‌ఫ్యూమ్‌, ఫేస్‌ క్రీమ్‌ వంటి ఉత్పత్తులు వాడమని చాలాసార్లు చెప్పాను. కానీ, అతను నా మాటలు పట్టించుకోకపోగా.. అలాంటివన్నీ కేవలం మహిళలు మాత్రమే వాడతారని బదులిచ్చేవాడు. నా భర్త మాత్రమే కాకుండా వారి కుటుంబంలో చాలామంది మగవారు ఇలానే ఉంటారు. అతని అపరిశుభ్రత వల్ల మా దాంపత్యంలో కలహాలు పెరుగుతున్నాయి. అతనిలో మార్పు తీసుకురావాలంటే ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. దాంపత్యంలో కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాలే పెద్దవిగా మారుతుంటాయి. మీ విషయంలో అతని అలవాట్లు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయన్న విషయం అర్థమవుతోంది. అయితే వాటి వల్ల మీరు నిరాశపడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దీనికి బదులుగా సమస్యను పరిష్కరించుకోవడానికి ఉన్న మార్గాలను అన్వేషించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీ సమస్యలన్నిటిని ఒక్కసారిగా కాకుండా ఒక్కో సమస్యను విభజించి పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అన్ని సమస్యలను ఒకేసారి అవతలి వ్యక్తి ముందు పెట్టినప్పుడు.. వారి నుంచి ప్రతిస్పందన కూడా అంతే తీవ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మీ నిరాశ, అసహనాన్ని మాటిమాటికీ వ్యక్తపరచడం వల్ల లాభం లేకపోగా నష్టం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ క్రమంలో వ్యక్తిగత అపరిశుభ్రత వల్ల కలిగే నష్టాలు.. దానివల్ల మీరు పడుతున్న ఇబ్బందులను సున్నితంగా వివరించండి.

మీవారి కుటుంబంలో చాలామంది మగవారు ఇలానే ఉంటారని చెబుతున్నారు. మీ భర్తకు సైతం అదే అలవాటు వచ్చినట్లుంది. అయితే ఇలా వచ్చిన అలవాట్లను మార్చుకోవడానికి సమయం పడుతుంది. మీరు గత ఆరు సంవత్సరాలుగా అతని అలవాట్లను మార్చడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. కాబట్టి, మరికొంతకాలం వేచి చూడడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో సమస్య పరిష్కారం కోసం ఉన్న మిగతా అవకాశాలను కూడా పరిశీలించండి. అతను ఎక్కువగా ఎవరి మాటలు వింటారో వారి ద్వారా చెప్పించే ప్రయత్నం చేయండి. అప్పటికీ మార్పు రాకపోతే ఒకసారి మానసిక నిపుణులను సంప్రదించండి. వారు అతని ఆలోచనల్లో, అలవాట్లలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్