Published : 20/01/2023 21:13 IST

బీట్‌రూట్ కాక్‌టెయిల్ సూప్

చలికాలంలో వేడివేడిగా ఓ సూప్‌ లాగిస్తే ఆ హాయే వేరు.. పైగా ఇది ఆరోగ్యకరం కూడా! అలాంటి ఓ హెల్దీ సూప్‌ రెసిపీనే ఇది!

కావాల్సినవి :

బీట్‌రూట్‌ ముక్కలు - కప్పు

సొరకాయ ముక్కలు - కప్పు

టొమాటో ముక్కలు - అరకప్పు

బంగాళాదుంప ముక్కలు - అరకప్పు

చక్కెర - అర టీస్పూన్

ఉప్పు - తగినంత

మిరియాల పొడి - పావు చెంచా

క్రీమ్‌ - 2 టేబుల్‌ స్పూన్లు

పుదీనా లేక మెంతి ఆకుల తరుగు - కొద్దిగా

తయారీ :

ఒక ప్యాన్‌లో రెండు కప్పుల నీళ్లు పోసి అందులో బీట్‌రూట్, సొరకాయ, బంగాళాదుంప, టొమాటో ముక్కలను వేసి బాగా ఉడికించుకోవాలి. ముక్కలు బాగా ఉడికిన తర్వాత దించి చల్లార్చాలి. తర్వాత మిక్సీ పట్టుకొని వడకట్టుకోవాలి. తాగే ముందు కాస్త వేడి చేస్తూ.. రుచి కోసం కొద్దిగా చక్కెర, ఉప్పు, మిరియాల పొడి కలుపుకోవాలి. చివరగా సర్వ్‌ చేసుకునే ముందు పుదీనా లేదా మెంతి ఆకుల తరుగు, క్రీమ్‌తో గార్నిష్‌ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ బీట్‌రూట్‌ సూప్‌ రడీ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని