Indoor plants: ఇంట్లో మొక్కలతో లాభాలెన్నో..

మొక్కల్ని పెంచడం కొందరికో వ్యాపకం.. ఇంటి అలంకరణలో భాగంగానూ పెంచుతారు. చూడటానికి అందంగా ఉండటమే కాదు.. వాటి వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా? తోట ఉన్నా రోజంతా అక్కడే గడపలేం.. పైగా అందరికీ అంత వెసులుబాటు ఉండదు. అందుకే మంచి ఇండోర్‌ మొక్కల్ని ఎంపిక చేసుకొని పెంచేయండిలా...

Published : 16 May 2023 00:26 IST

మొక్కల్ని పెంచడం కొందరికో వ్యాపకం.. ఇంటి అలంకరణలో భాగంగానూ పెంచుతారు. చూడటానికి అందంగా ఉండటమే కాదు.. వాటి వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా? తోట ఉన్నా రోజంతా అక్కడే గడపలేం.. పైగా అందరికీ అంత వెసులుబాటు ఉండదు. అందుకే మంచి ఇండోర్‌ మొక్కల్ని ఎంపిక చేసుకొని పెంచేయండిలా...

ఇంట్లో వంట చేసినప్పుడు ఘాటు వాసనలు వస్తుంటాయి. మొక్కలు వాటితోపాటు వేడిని కూడా తగ్గిస్తాయి. స్పైడర్‌, పీస్‌లిల్లీ, వంటివైతే గాల్లోని కాలుష్యాన్ని తగ్గించి, స్వచ్ఛతను పెంచుతాయి.  వీటి వాసనకు మానసిక స్థితి మెరుగుపడి, ఒత్తిడి తగ్గుతుంది.

ప్రశాంతంగా.. మానసికంగా ధైర్యంగా ఉండేందుకు మొక్కలు చక్కగా తోడ్పడతాయి. ఆకుపచ్చగా ఉన్న వాటిని చూస్తూ కూర్చున్నప్పుడు మనసు ప్రశాంతంగా మారుతుంది. అదీకాక మనం పెంచిన మొక్కలు ఎదుగుతుంటే సంతోషంగానూ ఉంటుంది. మొక్కల మధ్య తిరుగుతుంటే వాటి గాలి, రంగు మరింత ఉత్సాహంగా పనిచేసేలా మెదడును ప్రోత్సహిస్తాయి. దాంతో పాటు సానుకూల ధోరణి కూడా ఏర్పడుతుంది.

అలర్జీలనూ తగ్గించేలా.. మొక్కల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి మనకు జలుబు, దగ్గు లాంటివి రాకుండా ఆపుతుంది. ఇంట్లో తులసి మొక్కల్లాంటివి పెంచుకుంటే రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు అలర్జీలనూ దూరం చేస్తాయి.

మంచి నిద్ర.. ఒత్తిడి తగ్గి మానసికంగా ప్రశాంతంగా ఉన్నామంటే వెంటనే నిద్ర పట్టేస్తుంది. అలా తేలికగా నిద్రలోకి జారుకునేలా చేసే లావెండర్‌ వంటి మొక్కలని ఎంపిక చేసుకోవచ్చు. వీటితో మనసుకు హాయిగా అనిపించి గాఢనిద్రలోకి వెళ్లిపోతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని