Published : 29/01/2022 18:30 IST

నిమ్మచెక్కలతో ప్రయోజనాలెన్నో..!

సీజన్‌తో సంబంధం లేకుండా నిమ్మకాయలను ఉపయోగిస్తుంటాం. నిమ్మకాయల నుంచి రసం పిండుకున్న తర్వాత వాటి చెక్కలను చాలామంది పడేస్తుంటారు. కానీ వాటిని కూడా పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అదెలాగో చూద్దాం రండి...

* బీట్‌రూట్, స్ట్రాబెర్రీ, నేరేడు వంటి పండ్లను కట్‌ చేస్తున్నప్పుడు చేతులు రంగు మారుతుంటాయి. ఆ మరకలు పోవాలంటే నిమ్మచెక్కతో రుద్దుకుంటే సరిపోతుంది.

* జిడ్డుగా మారిన వంటింటి సింకును నిమ్మచెక్కతో రుద్ది చూడండి. మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.

* చెమట వల్ల బూట్లు దుర్వాసన వస్తుంటాయి. ప్రతిసారీ బూట్లను కడగలేం. అలాంటప్పుడు ఎండబెట్టిన నిమ్మచెక్కలని బూట్లలో వేసి ఉంచితే దుర్వాసన రాకుండా ఉంటాయి.

* తువాళ్లకు పట్టిన మరకలు ఒక పట్టాన వదలవు. ఇలాంటప్పుడు నిమ్మతొక్కలు, వంటసోడా వేసిన నీటిలో వాటిని నానబెట్టి ఉతికితే తెల్లబడతాయి.

* వాడేసిన నిమ్మచెక్కలని ఉప్పులో ముంచి వాటితో కాయగూరల బోర్డుని రుద్దితే మరకలు లేకుండా కనిపిస్తుంది.

* వెనిగర్‌లో నిమ్మతొక్కలను వేసి రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజున కాసిన్ని నీళ్లు కలిపి ఓ సీసాలో తీసుకోవాలి. దీంతో అద్దాలు, స్నానాల గదుల గోడలు శుభ్రం చేసుకోవచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని