ఆక్సిజన్ సపోర్ట్ లేకుండానే పర్వతాలు ఎక్కేస్తోంది!
కొంతమంది సౌకర్యవంతమైన జీవితం కోరుకుంటే.. మరికొందరు అడుగడుగునా సాహసాలతోనే సహవాసం చేస్తుంటారు. బెంగాల్‌కు చెందిన పియాలీ బసక్ రెండో కోవకు చెందుతుంది. పర్వతారోహణే తన ఆరోప్రాణంగా పెరిగిన ఆమె.. దాన్నే తన కెరీర్‌గా మలచుకుంది. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లను, ఆర్థిక అడ్డంకు.....
కొంతమంది సౌకర్యవంతమైన జీవితం కోరుకుంటే.. మరికొందరు అడుగడుగునా సాహసాలతోనే సహవాసం చేస్తుంటారు. బెంగాల్‌కు చెందిన పియాలీ బసక్ రెండో కోవకు చెందుతుంది. పర్వతారోహణే తన ఆరోప్రాణంగా పెరిగిన ఆమె.. దాన్నే తన కెరీర్‌గా మలచుకుంది. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లను, ఆర్థిక అడ్డంకుల్ని ఎదుర్కొంది. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. సాధారణంగా పర్వతారోహణే ఓ పెద్ద సాహసమంటే.. అందులోనూ ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా ఎత్తైన శిఖరాల్ని అధిరోహిస్తూ ఔరా అనిపిస్తోంది. తాజాగా ప్రపంచంలోకెల్లా ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్‌ను ఇదే తరహాలో అధిరోహించి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్రకెక్కింది పియాలీ. ఈ నేపథ్యంలో ఎన్నో ఎత్తుపల్లాల్ని ఎదుర్కొని మౌంట్ ఎవరెస్ట్ దాకా సాగిన ఆమె పర్వతారోహణ ప్రయాణం గురించి తెలుసుకుందాం..!
పర్వతారోహణలో భాగంగా.. ఎత్తుకు వెళ్లే కొద్దీ ప్రాణవాయువు విడుదల చేసే చెట్ల సంఖ్య తగ్గిపోతుంది.. తద్వారా గాలిలో ఆక్సిజన్ స్థాయులు కూడా పడిపోతాయి. అందుకే పర్వతారోహకులు తమ వెంట ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్తుంటారు. అయితే వీటి అవసరం లేకుండానే ఎత్తైన పర్వతాల్ని అధిరోహిస్తోంది బెంగాల్ హూగ్లీకి చెందిన 31 ఏళ్ల పియాలీ బసక్. గతేడాది అక్టోబర్‌లో నేపాల్‌లోని మౌంట్ ధవళగిరి (ప్రపంచంలోనే ఏడో అత్యంత ఎత్తైన శిఖరం)ని ఆక్సిజన్ అవసరం లేకుండానే అధిరోహించిన ఆమె.. తాజాగా ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌ను సైతం ఆక్సిజన్ సపోర్ట్ లేకుండానే ఎక్కేసింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్రకెక్కిందామె.
అలా మొదలైంది!
మనం ఎంచుకునే కెరీర్‌కు ఎవరో ఒకరు/ ఏదో ఒక అంశం స్ఫూర్తిగా నిలుస్తుంటుంది. ఈ విషయానికొస్తే.. తనకు తన తల్లిదండ్రులే ప్రేరణ అంటోంది పియాలీ. ‘సరిగ్గా చెప్పాలంటే ఐదేళ్ల వయసు నుంచే నా పర్వతారోహణ ప్రయాణం మొదలైంది. చిన్న వయసులోనే అమ్మానాన్నలతో కలిసి, వాళ్ల చేయి పట్టుకొని కొండలెక్కేదాన్ని. ఇదే నేను పర్వతాలతో ప్రేమలో పడేలా చేసింది. ఇక నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు నా పాఠ్యపుస్తకాల్లో భాగంగా టెంజింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీల పర్వతారోహణ యాత్రల గురించి చదివా. అప్పుడే మౌంటెనీరింగ్ని నా కెరీర్‌గా మలచుకోవాలని నిర్ణయించుకున్నా..’ అంటోందీ ఉమన్ మౌంటెనీర్.
ఆ ఘనత నాదే!
గణిత శాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశాక మౌంటెనీరింగ్‌పై పూర్తి దృష్టి సారించిన పియాలీ.. డార్జిలింగ్‌లోని ‘హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్’లో పర్వతారోహణకు సంబంధించిన ప్రాథమిక మెలకువలు నేర్చుకుంది. ఆపై ‘ఇండియన్ మౌంటెనీరింగ్ ఫౌండేషన్’లో అడ్వాన్స్డ్ మౌంటెనీరింగ్ కోర్సు చేసిన ఆమె.. 2010లో హిమాచల్ ప్రదేశ్‌లోని ‘మౌంట్ ముల్కిలా’ (6,517 మీటర్లు) పర్వతారోహణతో తన జర్నీని మొదలుపెట్టింది. ఆపై ‘మౌంట్ మనస్లు (నేపాల్)’, ‘మౌంట్ భాగీరథీ - 2 (ఉత్తరాఖండ్)’లను అధిరోహించి తనకు తిరుగులేదనిపించింది.
‘పర్వతారోహణ నా ఆరోప్రాణం. ఇందులో సక్సెసయ్యే క్రమంలో ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. కొంతమంది గిట్టని వాళ్లు అసూయతో నా ఉన్నతికి అడ్డుపడాలని చూశారు. కానీ నా ఏకాగ్రత మొత్తం పర్వతారోహణపైనే పెట్టా. ఇదే మౌంటెనీరింగ్‌లో నాకంటూ ప్రత్యేకంగా ఓ పేజీ లిఖించుకునేలా చేసింది. 8 వేల మీటర్ల పైచిలుకు పర్వతాలను అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిని కూడా నేనే..’ అంటూ గర్వంగా చెబుతోందీ బెంగాలీ మౌంటెనీర్.
ఆక్సిజన్ అవసరం లేకుండానే..!
సాధారణంగా పర్వతారోహణే ఓ సాహసమనుకుంటే.. అందులోనూ ఆక్సిజన్ సపోర్ట్ లేకుండానే అలవోకగా పర్వతాలు ఎక్కేస్తూ రికార్డులు సృష్టిస్తోంది పియాలీ. గతేడాది అక్టోబర్‌లో నేపాల్‌లోని మౌంట్ ధవళగిరి (ప్రపంచంలోనే ఏడో అత్యంత ఎత్తైన శిఖరం)ని ఆక్సిజన్ అవసరం లేకుండానే అధిరోహించిన ఆమె.. తాజాగా ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌ను సైతం ఆక్సిజన్ సపోర్ట్ లేకుండానే ఎక్కేసింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్రకెక్కింది పియాలీ. నిజానికి 2019లోనే ఈ అరుదైన ఫీట్‌ను అందుకోవాల్సిందామె. అయితే పలు కారణాల రీత్యా అప్పుడామె ప్రయత్నం ఫలించలేదు. ఇక ఈసారి పట్టుబట్టి మరీ విజయం సాధించింది. ‘మానసికోత్సాహం, పట్టుదల.. ఈ రెండే నా విజయానికి సోపానాలు!’ అంటోన్న పియాలీ.. ఓవైపు మౌంటెనీరింగ్ని కొనసాగిస్తూనే.. మరోవైపు టీచర్‌గానూ విధులు నిర్వర్తిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!