Lemon: తళతళలాడించే నిమ్మ తొక్కలు!
రసం పిండేశాక నిమ్మచెక్కల్ని పారేస్తున్నారా? రసాయన క్లీనర్ల కన్నా నిమ్మచెక్కలు ఇంటిని శుభ్రం చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి.
రసం పిండేశాక నిమ్మచెక్కల్ని పారేస్తున్నారా? రసాయన క్లీనర్ల కన్నా నిమ్మచెక్కలు ఇంటిని శుభ్రం చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి.
మొక్కలు ఆరోగ్యంగా పెరగడం లేదా? మట్టిలో పీహెచ్ బ్యాలెన్స్ తగ్గి ఉండొచ్చు. ఇలా కాకుండా ఉండాలంటే వాడేసిన నిమ్మ తొక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి మొదళ్ల చుట్టూ పెట్టేయండి.
* కాయగూరలు తరిగే బోర్డుని నిమ్మచెక్కతో రుద్ది కాసేపయ్యాక కడిగేస్తే మరకలు పోవడంతో పాటు ఘాటైన వాసనలూ తొలగిపోతాయి. బోర్డు మీద చికెన్ కోసినప్పుడు ఇలా చేస్తే బ్యాక్టీరియా పెరగదు.
* దిండ్లకవర్లూ, కర్టెన్లూ వంటివి ఉతకడానికి నానబెట్టినప్పడు ఆ నీళ్లలో నిమ్మ చెక్కలను వేసి ఉంచండి. నిమ్మచెక్క మీద కాస్త సర్ఫ్ వేసి మరకలు ఉన్న చోట రుద్దండి. ఇవి మురికిని తొలగించడమే కాదు... ఫంగస్, బ్యాక్టీరియా కారకాలను సులువుగా వదిలిస్తాయి.
* సింకు దగ్గర ఉండే స్టీలు కుళాయిలపై నీటిమరకలు పడుతుంటాయి. నిమ్మచెక్కపై కాస్తంత వంట సోడా చల్లి దాంతో రుద్ది కడిగితే.. తళతళలాడతాయి.
* నిమ్మచెక్కలని సన్నగా తరిగి కాసిని నీళ్లలో వేసి ఆ పాత్రని మైక్రో అవెన్‌లో కొన్ని నిమిషాలు ఉంచి తీసేయండి. అలా చేస్తే దుర్వాసనలు తొలగిపోవడంతో పాటూ లోపల పడి ఉన్న పదార్థాలని శుభ్రం చేయడం కూడా తేలికవుతుంది. ఫ్రిజ్‌లో ఓ మూలగా నిమ్మ చెక్కని పెట్టి వదిలేయండి. దుర్వాసనలను పీల్చుకుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.