Summer: పోషకాల వేసవి పానీయాలు...
ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకొనే అలవాటుంటే చర్మం నిత్య యవ్వనమే అంటున్నారు ఆహారనిపుణులు. వీటిని పోషకాల పానీయాలుగా మారిస్తే మరిన్ని ప్రయోజనాలు అందుతాయని సూచిస్తున్నారు.
ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకొనే అలవాటుంటే చర్మం నిత్య యవ్వనమే అంటున్నారు ఆహారనిపుణులు. వీటిని పోషకాల పానీయాలుగా మారిస్తే మరిన్ని ప్రయోజనాలు అందుతాయని సూచిస్తున్నారు. వీటితో ఆరోగ్యకరమైన చర్మం మన సొంతమైతే, అందం మన చెంత ఉన్నట్లే అని చెబుతున్నారు.
గ్లాసు పాలకు చెంచా పీనట్ బటర్, పావుచెంచా దాల్చిన చెక్కపొడి, గుప్పెడు నానబెట్టిన ఓట్స్, చెంచా సత్తు పౌడర్‌ను మిక్సీలో వేసి చేసిన స్మూతీపై సబ్జాగింజలు చల్లి తీసుకొంటే చాలు. ఇందులోని కాల్షియం, విటమిన్ ఈ, డి సహా ప్రొటీన్లు కొలాజెన్ ఉత్పత్తికి తోడ్పడి చర్మానికి మృదుత్వాన్నిస్తాయి. ఈ స్మూతీలోని అమినోయాసిడ్స్ ఇన్‌ఫ్లమేషన్ సమస్యను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తసరఫరాను మెరుగుపరిచి చర్మాన్ని మెరిపిస్తాయి.
మజ్జిగతో సబ్జా..
గ్లాసు మజ్జిగలో పావుచెంచా జీలకర్ర పొడి, సరిపడా రాక్‌సాల్ట్ వేసి కలిపిన తర్వాత సబ్జా గింజలను చల్లితే చల్లని పోషకాల పానీయం సిద్ధమవుతుంది. ఇందులోని ఒమేగా-3 యాసిడ్స్ చర్మానికి మృదుత్వాన్నిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఫ్రీరాడికల్స్ నుంచి ప్రభావితంకాకుండా రక్షిస్తాయి. చర్మంలోని వ్యర్థాలను బయటకు పంపి కాంతులీనేలా చేస్తాయి.
కొబ్బరినీళ్లకు..
ప్రకృతి పానీయంగా పిలిచే కొబ్బరినీళ్లను గ్లాసు తీసుకొని ఇందులో టేబుల్ స్పూన్ గోండ్ కటీరాని కలపాలి. రుచికరమైన ఈ పానీయంలో ఏ,సీ,కే విటమిన్లు మెండుగా ఉండి చర్మాన్ని పొడిబారకుండా సంరక్షించి మృదువుగా, మెరిసేలా చేస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.