ఆమె మనసుకేం కావాలి?!

వాలెంటైన్స్‌డేకి ప్రేయసి లేదా భార్యకి ఏ కానుకిచ్చి మురిపించాలా అని మగవాళ్లు తెగ ఆలోచిస్తుంటారు. దుస్తులు, నగలు, గడియారం, టూర్‌  అంటూ జాబితా తీస్తారు . ఇంతకీ ఆమె మనసు కోరుకునేదేంటి?

Published : 14 Feb 2023 00:23 IST

వాలెంటైన్స్‌డేకి ప్రేయసి లేదా భార్యకి ఏ కానుకిచ్చి మురిపించాలా అని మగవాళ్లు తెగ ఆలోచిస్తుంటారు. దుస్తులు, నగలు, గడియారం, టూర్‌  అంటూ జాబితా తీస్తారు . ఇంతకీ ఆమె మనసు కోరుకునేదేంటి?

* సినిమాల్లో, మీమ్స్‌లో చూపినట్లు హోటళ్లలో తినిపించాలని, బ్యూటీ పార్లర్ల ఖర్చు భరించాలని, డ్రెస్సులూ యాక్ససరీసులు కొనివ్వాలనీ కోరుకోరు. అతను తనకోసం సమయం వెచ్చించాలనుకుంటారు.

* ప్రేమికుడితో కలిసి సినిమాలకూ షికార్లకూ వెళ్లాలనుకునే మాట నిజమే. అది కలిసి సమయం గడపాలన్న తపనే తప్ప ఖర్చుపెట్టించాలని కాదు. నిజానికి ఇద్దరూ బయటకు వెళ్లినప్పుడు ఆడపిల్లలే ఎక్కువ ఖర్చుపెడుతున్నట్లు ఎన్నో సర్వేల్లో తేలింది.

* ఆయా సందర్భాల్లో మెహర్బానీ కోసం కానుకలు ఇవ్వబోతే వాటితో పనేలేదు, సరదాగా కాసేపు కబుర్లు చెబితే చాలనే అమ్మాయిలే అధికశాతం ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.

* బాగా చదువుకుని, మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన అమ్మాయిలు కూడా ప్రేమికుడు లేదా భర్త దగ్గరకు వచ్చేసరికి చిన్నపిల్లలైపోతారు. తమను కాస్త గారాబం చేస్తూ ముద్దుముచ్చట్లాడితే మురిసిపోతారు. అతడి కోసమే ఆమె అందంగా సింగారించుకుంటుందని అర్థంచేసుకుని ‘ఈ డ్రెస్సులో భలే ఉన్నావు.. ఈ హెయిర్‌స్టయిల్‌ నీకు బాగా నప్పింది’ లాంటివి చేబితే పొంగిపోతారు. అయితే ఆ ప్రశంస పైపై మెచ్చుకోలుగా కాకుండా మనసులోంచి వస్తోందో లేదో గ్రహిస్తాయి వారి కళ్లు.

* అమ్మాయికి లేటెస్ట్‌ మోడల్‌ సెల్‌ఫోన్‌ కొనిస్తే ఐసైపోతుంది అనుకుంటే పొరపాటే. ప్రేమతో ఇచ్చే కానుక చిన్నదైనా అమూల్యంగా దాచుకుంటుంది! అంతకంటే ముఖ్యంగా తన అభిప్రాయాలను అతడు గౌరవించాలని కోరుకుంటుంది.

* తన అంతరంగాన్ని గ్రహించగలిగే అబ్బాయే ఆమెకి రారాజు. చిన్న దెబ్బ తగిలినా లేదా ఏ విషయంలోనైనా కలత చెందుతున్నా ఆరా తీసి ఓదార్పు నివ్వాలనుకుంటుంది. అతడి సమక్షంలో దిగులంతా మర్చిపోయి హాయిగా ఉండాలనుకుంటుంది.

* అన్నిటినీ మించి ఆడపిల్లలు తామున్నట్టే అతడూ నిజాయతీగా ఉండాలనుకుంటారు. తనతో ఉంటూనే ఇంకో అమ్మాయికి చేరువవ్వాలనుకుంటే ఇష్టపడరు. అది పొసెసివ్‌నెస్‌ అంటూ హేళన చేసేవాళ్లని నిక్కచ్చిగా దూరం పెట్టేస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్