Published : 07/08/2022 14:37 IST

నిజమైన స్నేహితులంటే ఇలా ఉండాలి..!

నిజమైన స్నేహితులంటే ఎవరు?? దీనికి ఒక్కొక్కరూ ఒక్కో రకంగా సమాధానం చెబుతారు. 'కష్టాల్లో ఉన్నా వెన్నంటి ఉండేవార'ని కొందరంటే.. 'మనల్ని మనలానే ఉంచుతూ ఉన్నత స్థానానికి చేరుకునేలా ప్రోత్సహించేవారు' అని మరికొందరంటారు. ఈ క్రమంలో- నిజమైన స్నేహితులు అంటే ఎవరో, ఎలా ఉండాలో కొన్ని కొటేషన్స్ చక్కగా చెబుతున్నాయి. మరి, 'ఫ్రెండ్‌షిప్ డే' సందర్భంగా అలాంటి అద్భుతమైన కొన్ని కొటేషన్స్‌పై మనమూ ఓ లుక్కేసొద్దాం రండి..!


ఈ పువ్వులే ఎందుకిస్తారంటే..?

స్నేహితుల దినోత్సవం నాడు మిత్రులకు పసుపు రంగు రోజాపూలిచ్చి శుభాకాంక్షలు చెప్పడం సర్వసాధారణమే. అయితే ఇవే ఎందుకిస్తారో తెలుసా? పసుపు రంగు.. గౌరవం, అభిమానం, ఆశావాదానికి ప్రతీక. స్నేహితులపై తమ ప్రేమను తెలియజేస్తూ అది కలకాలం శాశ్వతంగా ఉండిపోవాలని, వారు ఎప్పటికీ క్షేమంగా ఉండాలని కాంక్షిస్తూ ఈ పువ్వును ప్రేమగా తమ ప్రియనేస్తాలకు అందిస్తుంటారు. దీంతోపాటు ఇద్దరి మధ్య ఉన్న అనురాగాన్ని, తీపి గుర్తులను పంచుకుంటూ ఓ గులాబీ రోజాను కూడా అందిస్తే.. స్నేహబంధానికి పూర్తి అర్థాన్ని జోడించినవారవుతారు.


అక్కడ మహిళలకు ప్రత్యేకంగా...!

మహిళా దినోత్సవం, మదర్స్ డే.. వంటి రోజులు కేవలం మహిళలకు మాత్రమే ప్రత్యేకం.. అదే స్నేహితుల దినోత్సవం అంటే.. ఆడ, మగ అనే లింగ భేదాలు లేకుండా జరుపుకొనే రోజు. కానీ మహిళలకంటూ ప్రత్యేకంగా ఫ్రెండ్‌షిప్ డే అంటూ ఒకటి ఉందన్న విషయం మీకు తెలుసా? అవును.. మీరు విన్నది నిజమే. వర్జీనియాలో 1897లో స్థాపించిన 'కప్పా డెల్టా' అనే సోషల్ క్లబ్‌లో మెంబర్‌షిప్ తీసుకున్న దాదాపు 1.80 లక్షల మంది మహిళలంతా కలిసి తొలిసారిగా జాతీయ మహిళా స్నేహితుల దినోత్సవం జరుపుకొన్నారట. మహిళల కోసం మహిళలంతా కలిసి జరుపుకొనే ఈ ప్రత్యేకమైన రోజుకు యూఎస్ రాష్ట్రాల్లోని గవర్నర్‌లు క్రమంగా మద్దతివ్వడంతో అక్కడ ఏటా సెప్టెంబర్‌లోని మూడో ఆదివారం నాడు ‘జాతీయ మహిళా స్నేహితుల దినోత్సవం’ జరుపుకొంటున్నారు. ఈ రోజున ఒకరికొకరు విలువైన బహుమతులు అందించుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా మహిళలంతా కలిసి కట్టుగా ఉన్నామనే సందేశాన్ని ఈ ప్రత్యేక సందర్భం ద్వారా చెప్పకనే చెబుతున్నారు అక్కడి మహిళలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్