
వామ్మో.. అలా 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేస్తే ఇలా అవుతారు!
చాలా కంపెనీల పని స్వభావాన్ని పరిశీలిస్తే కరోనాకు ముందు, కరోనా తర్వాత అన్నట్లుగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఐటీ సంస్థలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉన్నా.. కొన్ని కంపెనీలు ఆఫీసు నుంచే పనిచేసేవి. ఇక ఎప్పుడైతే కరోనా ఫీవర్ మొదలైందో.. బయటికెళ్లి చిక్కుల్లో పడడమెందుకని.. తమ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చేశాయి. ఇప్పటికీ ఇదే పద్ధతిని చాలా కంపెనీలు అమలు చేస్తున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. ఇంటి నుంచి పని అనగానే గంటల తరబడి కంప్యూటర్‌కే అతుక్కుపోతున్నారు చాలామంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలా గ్యాప్ లేకుండా పనిచేయడం వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అయితే ఇలా నిరంతరాయంగా కూర్చొని పనిచేయడం వల్ల మానసిక సమస్యలే కాదు.. ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలు, రోగాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే శారీరక శ్రమ, మానసిక ప్రశాంతత లేకుండా నిరంతరాయంగా కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయడం వల్ల ఎలాంటి రోగాలొస్తాయో వివరిస్తున్నారు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..
ఎలాగో ఇంటి నుంచే పనిచేస్తున్నాం కదా అని ఆలస్యంగా నిద్రలేవడం, గబగబా తయారై కంప్యూటర్ ముందు కూర్చోవడం, ఆదరాబాదరాగా ఏదో ఒకటి తినడం, ఇంకొందరైతే ఓ వేళా పాళా లేకుండా ఎప్పుడు చూసినా ఏదో ఒక చిరుతిండి నములుతూ ఉండడం, నిరంతరాయంగా కంప్యూటర్ స్క్రీన్‌కే కళ్లప్పగించడం, మధ్యమధ్యలో కాసేపైనా విరామం తీసుకోకపోవడం.. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్‌లో చాలామంది చేస్తోన్న పొరపాట్లివి. ఫలితంగా అటు మానసికంగా ఒత్తిడి ఎదురవడంతో పాటు శరీరానికి శ్రమ కరువై లేనిపోని అనారోగ్యాల బారిన పడుతున్నారు.
కంప్యూటర్ విజన్ సిండ్రోమ్
పనిలో పడిపోయి రోజంతా కంప్యూటర్‌కే కళ్లప్పగించేస్తే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ బారిన పడే ప్రమాదం ఉంది. కళ్లు పొడిబారిపోవడం, కళ్లలో వాపు, ఎరుపెక్కడం, దురద, చూపు మందగించడం.. వంటివి ఈ సమస్య లక్షణాలు. ఇదే అలవాటు సుదీర్ఘకాలంగా కొనసాగిస్తే కంటి చూపుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
శరీరం వంగిపోతుంది!
శరీరానికి శ్రమ కలిగించకుండా, మధ్యమధ్యలో కాసేపైనా విరామం తీసుకోకుండా ఎక్కువ సమయం పాటు కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల మెడ నొప్పి వేధిస్తుంది. అలాగే భుజాలు ముందుకు వంగినట్లుగా తయారై గూనిగా కనిపించే అవకాశం ఉంది. ఇది సుదీర్ఘకాలం పాటు కొనసాగితే మెడలు, భుజాలు, చేతులు, వెన్నెముక.. ఇలా ఒకదాని తర్వాత మరొక దానిపై ప్రతికూల ప్రభావం పడి శరీరాకృతి అదుపు తప్పుతుంది.
నిరంతరాయంగా టైప్ చేస్తున్నారా?
సుదీర్ఘకాలం పాటు కంప్యూటర్ ముందు కూర్చోవడమే కాదు.. నిరంతరాయంగా టైపింగ్ చేసినా చేతులు, మణికట్టు భాగాల్లోని కండరాలు, నరాలు డ్యామేజ్ అయి విపరీతమైన నొప్పి వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇది శరీరంలోని ఇతర భాగాల ఆకృతిని కూడా దెబ్బతీస్తుంది.
జుట్టు రాలడం
‘డి’ విటమిన్‌ను లేలేత సూర్యకిరణాల నుంచి మన శరీరం గ్రహిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంట్లో నుంచి బయటికి కదలకుండా కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయడం వల్ల ఈ విటమిన్ లోపించి.. జుట్టు రాలిపోవడంతో కొత్త జుట్టు రావడానికి ఆటంకం ఏర్పడుతుంది. అలాగే విటమిన్ ‘డి’ లోపం వల్ల అలోపేసియా అనే సమస్య తలెత్తి అక్కడక్కడా జుట్టు పూర్తిగా ఊడిపోవడానికి కారణమవుతుంది.
కళ్ల కింద వలయాలు
ఎక్కువ సమయం కంప్యూటర్ స్క్రీన్‌ను తదేకంగా చూడడం వల్ల కళ్లు అలసటకు గురవుతాయి. ఫలితంగా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి.
నడుం నొప్పి
మన పనిలో భాగంగా మొబైల్, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికాలను ఎక్కువ సమయం పాటు వినియోగించడం వల్ల మెడ, భుజాలు, ఇతర శారీరక భాగాలపై ఒత్తిడి పడుతుంది. అలాగే నడుం నొప్పి, కీళ్లు పట్టేయడం.. వంటి సమస్యలు కూడా అధికమవుతాయి.
ముఖంపై ముడతలు
వయసు పైబడే కొద్దీ చర్మం ముడతలు పడడం సహజం. అయితే మనం చేసే కొన్ని పొరపాట్లు, పాటించే అలవాట్ల వల్ల అవి ముందే వచ్చేస్తాయి. రోజంతా కంప్యూటర్‌పైనే పనిచేయడం, దాన్ని తదేకంగా చూడడం కూడా అందుకు ఓ కారణం. తద్వారా చిన్న వయసులోనే వయసు పైబడిన ఛాయలు మన ముఖంపై కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.
స్థూలకాయం
ఎక్కువ సమయం పాటు ఒకే చోట కూర్చోవడం, స్నాక్స్ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం.. ఇవన్నీ దీర్ఘకాలం పాటు కొనసాగితే శరీరంలో కొవ్వు స్థాయులు పెరిగిపోతాయి. కాలక్రమేణా ఇది స్థూలకాయానికి దారితీస్తుంది. ఇంటి నుంచి పని చేసే వారిలో ఈ సమస్య అధికంగా ఉంటోంది. ఈ క్రమంలో పొట్ట, తొడలు, పిరుదులు, మడమలు.. తదితర భాగాల్లో దీని ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
చర్మం నిర్జీవంగా..!
ఎక్కువ సమయం పాటు ఇంట్లోనే కూర్చొని పనిచేయడం వల్ల మన శరీరానికి సూర్యరశ్మి తగలదు. తద్వారా ‘డి’, ‘బి-12’ విటమిన్లు లోపించి చర్మం పాలిపోయినట్లుగా, డల్‌గా, నిర్జీవంగా కనిపిస్తుంది.
ఒత్తిడి పెరిగిపోతుంది!
ఎక్కువ సమయం పాటు ఇతరులతో మాట్లాడకుండా ఒంటరిగా పనిచేసుకోవడం వల్ల శరీరంలో ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ స్థాయులు పెరుగుతాయి. ఇది క్రమంగా రక్తపోటుకు దారితీస్తుంది. ఇక నిరంతరాయంగా పనిచేయడం వల్ల దీర్ఘకాలంలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ఆస్కారం కూడా ఉంది.
ఇలా కాకూడదంటే ఏం చేయాలి?
శరీరానికి, మనసుకు ఎలాంటి శ్రమ కలిగించకుండా సుదీర్ఘకాలం పాటు ఇలా ఇంట్లో నుంచి పనిచేయడం వల్ల ఎన్నెన్ని అనారోగ్యాలు ఎదురవుతాయో తెలిసింది కదా! అయితే మరి, ఇవన్నీ తలెత్తకుండా శారీరక, మానసిక ఆరోగ్యం సొంతం చేసుకోవడానికి; ఉత్తమ పనితీరు కనబరచడానికి నిపుణులు కొన్ని సలహాలు అందిస్తున్నారు. అవేంటో చూద్దాం...
* ఎక్కువ సమయం ఒకే చోట కూర్చొని పనిచేయడం కాకుండా ఒక ప్రణాళిక ప్రకారం పనిచేసేలా ప్లాన్ చేసుకోవాలి. ఈ క్రమంలో వ్యాయామం చేయడం, మనసు పెట్టి తినడం, మధ్యమధ్యలో కాసేపు విరామాలు తీసుకోవడం.. ఇలాంటివన్నీ పాటించేలా ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం ఫాలో అయితే ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు.. అలాగే పనిలో నాణ్యత కూడా పెరుగుతుంది.
* ఆఫీస్‌లో పనిచేసేటప్పుడు సహోద్యోగులతో ముఖాముఖి చర్చలుంటాయి. కానీ ఇంటి నుంచి పనిచేసే క్రమంలో ఈ అవకాశం లేకపోవడంతో ఒత్తిడి పెరుగుతుంది. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా మధ్యమధ్యలో కొలీగ్స్‌తో చాట్ చేయడం, ఫోన్లో మాట్లాడడం వల్ల ఈ సమస్య ఉండదంటున్నారు నిపుణులు.
* ఎప్పుడు చూసినా పని పని అని కాకుండా ఇంటి ఆవరణలో లేదంటే బాగా గాలి ప్రసరించే ప్రదేశంలో రోజూ కాసేపు వ్యాయామం చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ఈ క్రమంలో యోగాకూ ప్రాధాన్యమివ్వాలి. తద్వారా పనిచేసే క్రమంలో వేధించే మెడ నొప్పి, ఇతర శారీరక నొప్పులు తగ్గిపోతాయి. అలాగే మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
* పనిపై ఏకాగ్రత పెరిగేలా ఇంట్లోనే పని వాతావరణాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ క్రమంలో ఒక గదిని ఆఫీస్ క్యాబిన్‌గా మార్చుకోవాలి. ఆ అవకాశం లేని వారు తమకు నచ్చిన ప్రదేశంలో సిస్టమ్ సెటప్ చేసుకొని.. ఆ చుట్టూ ఇండోర్ ప్లాంట్స్ వంటి మనసుకు ఆహ్లాదాన్ని పంచే వస్తువులతో అలంకరించాలి.
* మధ్యమధ్యలో తీసుకునే విరామ సమయాన్ని మన మనసుకు నచ్చిన వాళ్లతో మాట్లాడడానికి, ప్రకృతితో గడపడానికి, చిన్నపాటి వ్యాయామాలు చేయడానికి కేటాయించడం వల్ల మనసుకు ఉల్లాసంగా అనిపిస్తుంది. తద్వారా ఒత్తిడి తగ్గి పని మీద ఏకాగ్రత పెరుగుతుంది.
* పని మధ్యలో సహోద్యోగులతో ఆన్లైన్ మీటింగ్స్, ఒకరి ఆలోచనలు మరొకరు పంచుకోవడం, ఉత్తమ పనితీరు కనబరిస్తే ప్రశంసించడం.. వంటి చిట్కాలు కూడా ఉద్యోగులు నాణ్యమైన పనితీరు కనబరిచేందుకు దోహదం చేస్తాయి. అలాగే కొలీగ్స్ మధ్య సత్సంబంధాలు నెలకొనేందుకు తోడ్పడతాయి.
సో.. ఇవండీ.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే క్రమంలో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే పాటించాల్సిన కొన్ని చిట్కాలు, జాగ్రత్తలు! మరి, మనమూ వీటిని దృష్టిలో ఉంచుకొని చక్కగా ఇంటి నుంచే పనిచేద్దాం.. నాణ్యమైన పనితీరును కనబరుద్దాం..!
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని

ఫుల్‌టైం ఉద్యోగం చేయమంటున్నారు!
నేనో వెబ్ డిజైనర్‌ని. కొవిడ్ వల్ల ఉద్యోగం పోయింది. ఏడాదికిపైగా చిన్న చిన్న ప్రాజెక్టులు చేస్తున్నా. సంపాదనా బాగుంది. నా పని మెచ్చి ఎందరో రిఫరెన్సులూ ఇస్తున్నారు. నిజానికి ఉద్యోగంలో కంటే రెట్టింపు సంపాదిస్తున్నా. నాకు నచ్చిన వీణను వాయిస్తున్నా. చిన్నచిన్న ప్రదర్శనలిస్తున్నా.తరువాయి

కొత్త పెళ్లికూతుళ్లు.. వీటి గురించే తెగ వెతికేస్తున్నారట!
కొత్తగా పెళ్లై అత్తారింట్లో అడుగుపెట్టిన అమ్మాయి మనసులో ఎన్నో ఆలోచనలు.. కొత్త కోడలిగా అత్తింట్లో ఎలా మసలుకోవాలి? వాళ్ల మనసులు ఎలా గెలుచుకోవాలి? భర్తకు మరింత దగ్గరవడమెలా?.. నవ వధువుల మనసంతా ఇలాంటి విషయాల చుట్టే తిరుగుతుంటుంది. ఇలా వీళ్ల మనసులో ఉన్న ఆలోచనలు తెలుసుకోవడానికే.....తరువాయి

పెదనాన్న ఆస్తి నేను రాయించుకోవచ్చా?
నా వయసు 24. మా పెద్దనాన్నగారికి భార్యా, పిల్లలు లేరు. తనకున్న ఇంటి స్థలాన్ని నా పేర రాస్తానంటున్నారు. ఇది వీలునామా ద్వారా రాయించుకోవాలా? రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా? లేదంటే నన్ను ఆయన దత్తత తీసుకోవాలా? భవిష్యత్తులో ఎలాంటి చిక్కులూ లేకుండా మంచి మార్గాన్ని సూచించగలరు....తరువాయి

Entrepreneurship: సిబ్బందిలో ఇలా ప్రేరణ కలిగించండి!
బిజినెస్ అంటేనే ఎన్నో సవాళ్లతో కూడుకున్న విషయం. ఎదురయ్యే ప్రతి సమస్యను సమర్థతతో, సమయస్ఫూర్తితో పరిష్కరించాలి. మనకు అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా ఉపయోగిస్తూ లాభాలు రాబట్టే వారే సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ అవుతారు. ఈ క్రమంలో బిజినెస్‌లో ఉండే అతి పెద్ద ఛాలెంజ్....తరువాయి

ఒత్తిడిని తరిమికొట్టేయొచ్చు...
ఒత్తిడి... మూడక్షరాల పదమే కానీ తెగ కలవరపెడుతుంది. మామూలు అనారోగ్యమైతే కొద్ది రోజుల్లో తగ్గిపోతుంది. ఒత్తిడి అలా కాదు, అలసట కలిగిస్తుంది, అలజడి సృష్టిస్తుంది. శారీరక, మానసిక అనారోగ్యాలకు దారితీస్తుంది. అలాంటి ఒత్తిడితో బాధపడే బదులు దాన్నెలా అదుపులో పెట్టుకోవాలో చూద్దాం...తరువాయి

Yoga Day : అందుకే ‘నవ్వు’తూ యోగా చేసేద్దాం!
ఎలాంటి అనారోగ్యాన్నైనా, మానసిక సమస్యనైనా దూరం చేసే శక్తి యోగాకు ఉందనడం అతిశయోక్తి కాదు. అందుకే చాలామంది తాము చేసే రోజువారీ వ్యాయామాల్లో భాగంగా యోగాను చేర్చుకుంటుంటారు. అయితే ఇందులోనూ ఎన్నో యోగా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. లాఫ్టర్ యోగా అలాంటిదే! ఇది నవ్వుతూ....తరువాయి

మీలో ఈ నైపుణ్యాలున్నాయా..
గీతిక డిగ్రీ చేసింది. మంచి విద్యార్థి కదా.. తన మార్కులకు తగ్గట్టుగానే ఉద్యోగానికి పిలుపులూ వస్తున్నాయి. వచ్చిన చిక్కల్లా ఎంపికవ్వకపోవడమే. మంచి మార్కులు, సబ్జెక్టుపై పట్టున్నా ఎందుకిలా అని మదనపడుతోంది. కొలువుకి ఇవే సరిపోవంటున్నారు నిపుణులు. ఇంకా ఏం కావాలో చెబుతున్నారిలా..తరువాయి

తండ్రి గొప్పతనాన్ని చాటాలనుకుంది!
అమ్మ జన్మనిస్తే నాన్న జీవితాన్నిస్తాడు. వేలు పట్టి నడిపించి, విద్యాబుద్ధులు నేర్పించి తన బిడ్డల్ని ప్రయోజకుల్ని చేయడానికి నిరంతరం కష్టపడుతూనే ఉంటాడు. మనం ఒక్కో మెట్టు ఎక్కుతుంటే తానే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినంత ఆనందాన్ని పొందుతాడు. అలా ఎదిగే క్రమంలో పొరపాటున తప్పటడుగు వేస్తుంటే దండించైనా....తరువాయి

Guinness World Records: ఐదేళ్లకే పుస్తకం రాసేసింది!
‘ఆసక్తి ఉన్న అంశాల్లో పిల్లల్ని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలరు..’ ఈ విషయం మరోసారి రుజువైంది. ఇందుకు తాజా ఉదాహరణే.. యూకేకు చెందిన బెల్లా జే డార్క్. ఐదేళ్ల వయసున్న ఈ అమ్మాయి తన సృజనాత్మక ఆలోచనలతో ఓ పుస్తకం రాసింది. అంతేకాదు.. ఆ కథకు తగ్గట్లుగా తన చిట్టి చేతులతో అందంగా....తరువాయి

ఆరోగ్యమంతా ‘పుస్తకం’లోనే ఉందంటున్నారు!
‘మనం తీసుకునే ఆహారానికి, ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉంది’ అంటోంది బాలీవుడ్ ఫిట్నెస్ ఫ్రీక్ మలైకా అరోరా. పోషకాహారం తీసుకుంటే మన శరీరంలోని ఎన్నో అనారోగ్యాల్ని తరిమికొట్టచ్చంటోంది. ఆరోగ్యం-ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యమిచ్చే ఈ ముద్దుగుమ్మ.. ఇందుకోసం తాను పాటించే చిట్కాల్ని సోషల్ మీడియాతరువాయి

Prathyusha Suicide: అలా అనిపించినప్పుడు ఒక్క క్షణం ఆగి.. ఆలోచించండి!
సమస్యలనేవి ప్రతి ఒక్కరి జీవితంలో సహజం. అయితే కొంతమంది వీటి గురించి మరీ లోతుగా ఆలోచించి మానసిక ఒత్తిడి, ఆందోళనల్లోకి కూరుకుపోతుంటారు. ‘ఇక నా జీవితం వ్యర్థం!’ అన్న వైరాగ్య భావనలోకి వెళ్లిపోతారు. ఇలాంటి ఆలోచనలు ఒక్కోసారి ఆత్మహత్య ప్రయత్నానికి కూడా....తరువాయి

ఆస్తి తీసుకున్నారు.. బాధ్యత మరిచారు!
మా అత్తమామలకు ఇద్దరు అబ్బాయిలు. మా మామయ్య చనిపోక ముందు తన స్వార్జితం రెండు ఎకరాల పొలాన్ని మా బావగారికి 2002లో రాశారు. అందులో మావారికి వాటా ఇవ్వలేదు. మావారూ అప్పుడు అడ్డు చెప్పలేదు. మా అత్తమామలు మొదట్నుంచీ మా దగ్గరే ఉండేవారు. ఇప్పటికీ అత్తయ్య మా దగ్గరే ఉంటున్నారు. ఆమెకు 85 ఏళ్లు. మా బావగారు గతేడాది మరణించారు. ఆయన ఉన్నప్పుడూ తల్లి బాగోగులు చూసుకోలేదు. ఇప్పుడు మా ఆర్థిక పరిస్థితి ఏమంత బాలేదు...తరువాయి

Back To Work: ఇలా చేస్తే కెరీర్లో మళ్లీ రాణించచ్చు!
అనామిక ఎనిమిది నెలల బాబుకు తల్లి. డెలివరీకి ముందు వరకు ఓ ఐటీ కంపెనీలో ఉన్నత హోదాలో పనిచేసిన ఆమెను.. ప్రసవానంతర సెలవు అనంతరం ఏవేవో కారణాలు చెప్పి సంస్థ ఉద్యోగంలో నుంచి తొలగించింది. సాధన తల్లిదండ్రులు, అత్తమామలు ముసలి వాళ్లు. ఓ చంటి బిడ్డకు తల్లైన ఆమె.. పాపాయిని వాళ్లకు అప్పగించే.....తరువాయి

ఉద్యోగానికి వెళుతూనే...
విమల ఇద్దరు పిల్లలకు అన్నీ చేసి మరీ అత్తగారికి అప్పగించి వెళుతుంది. సాయంత్రం వచ్చాక మళ్లీ వారి బాధ్యతలను తనే చూసుకుంటుంది. అయినా సరే... ఆ, ఉద్యోగం చేసే వాళ్లకు పిల్లలను పెంచడం ఎలా కుదురుతుందిలే అనే బంధువుల వ్యాఖ్యలు ఆమెను బాధిస్తుంటాయి. దాంతో తను సరిగ్గా చేయలేకపోతున్నానా అని ఆందోళనపడుతూ ఉంటుంది. అవేవీ పట్టించుకోవద్దు... ఉద్యోగం చేస్తూనే పిల్లలను చక్కగా తీర్చిదిద్దొచ్చు అంటున్నారు నిపుణులు.తరువాయి

మీ బ్రాండ్ విలువ పెంచుకోండి..!
మాట్లాడకూడదు, మన పని మాత్రమే మాట్లాడాలి.. అనుకుంటారు చాలామంది మహిళలు. పై అధికారులే తమ పనిని గుర్తించి పదోన్నతులు, ప్రోత్సాహకాలు ఇస్తారనుకుంటారు. ఇలా అనుకోవడమే ‘టియారా సిండ్రోమ్’. ఈ సిండ్రోమ్ కారణంగానే చాలామంది కెరియర్లో వెనకబడుతున్నారు. దీన్ని అధిగమించడానికి నిపుణులు చెప్పే సూచనలేంటంటే...తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- Artificial Jewellery: ఆ అలర్జీని తగ్గించుకోవాలంటే..!
- దిష్టి తాడుకు.. నయా హంగు!
- వయసును దాచేద్దామా...
- మొటిమలకు.. కలబంద!
- కాలి మెట్టె.. కాస్త నాజూగ్గా!
ఆరోగ్యమస్తు
- ప్రసవం తర్వాత.. ఆ భాగం బిగుతుగా మారాలంటే..
- ఈ పోషకాలతో సంతాన భాగ్యం!
- అరచేతుల్లో విరబూసే గోరింట ఆరోగ్యానికీ మంచిదే..!
- యోగా చేస్తున్నది ఏడు శాతమే!
- ఇవి తింటే ఒత్తిడి దూరం..
అనుబంధం
- సారీతో నేర్పించొచ్చు
- బంధానికి ‘బ్రేక్’ ఇవ్వకండి..!
- పండంటి జీవితానికి పంచ సూత్రావళి
- పిల్లల్ని వాళ్ల గదిలో ఎప్పుడు పడుకోబెట్టాలి?
- వేధింపులకు గురవుతున్నారేమో..
యూత్ కార్నర్
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- అందాల.. గిరి కన్య
- Down Syndrome: అప్పుడు ప్రతి క్షణాన్ని ఆస్వాదించా..!
- ప్రియాంకా మాటలే.. కిరీటానికి బాటలు
- అమ్మమ్మ సూచన... కోట్ల వ్యాపారం!
'స్వీట్' హోం
- పిల్లలు తక్కువ బరువుంటే..
- మొక్కలకు ఆహార కడ్డీలు..
- Cleaning Gadgets: వీటితో సులభంగా, శుభ్రంగా..!
- వర్షాల వేళ వార్డ్రోబ్ జాగ్రత్త!
- ఈ మొక్కతో ఇంటికి అందం, ఒంటికి ఆరోగ్యం!
సూపర్ విమెన్
- అందుకే పీహెచ్డీ వదిలేసి వ్యవసాయం చేస్తోంది!
- Miss India Sini Shetty: చిన్నప్పటి నుంచే కలలు కంది.. సాధించింది!
- 70ల్లో... 80 పతకాలు!
- ఆమె నగ... దేశదేశాలా ధగధగ
- ఆహార సేవకులు