Published : 03/01/2023 19:44 IST

వీటి వల్ల ప్రయోజనాలెన్నో..!

నలుపు, నీలం.. మొదలైన రంగుల్లో ఉండే కొన్ని పదార్థాలను బ్లాక్ ఫుడ్స్‌గా చెప్పుకోవడం తెలిసిందే. ఆంథోసయనిన్స్ అనే పిగ్మెంట్లు వీటిలో అధికంగా ఉంటాయట. వీటిలో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందించి వివిధ అనారోగ్యాల నుంచి రక్షణ కల్పిస్తాయి. నల్ల ద్రాక్ష, నల్ల నువ్వులు కూడా ఇదే కోవకు చెందుతాయి. ఈక్రమంలో వీటి వల్ల కలిగే కొన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

నల్ల ద్రాక్ష

పుల్లపుల్లగా-తియ్యతియ్యగా ఎంతో రుచిగా ఉండే నల్ల ద్రాక్ష పండ్లలో ఎన్నో పోషకాలు నిండి ఉన్నాయంటున్నారు నిపుణులు.

⚛ ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

⚛ కొవ్వులు కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారు, గుండె జబ్బులున్న వారు వీటిని తీసుకోవచ్చు.

⚛ వీటిని నేరుగానైనా తినచ్చు.. సలాడ్స్‌, స్మూతీస్‌, జామ్స్‌.. రూపంలోనైనా ఆహారంలో చేర్చుకోవచ్చు.

నల్ల నువ్వులు

నల్ల నువ్వులతో లడ్డూలు తయారుచేసుకోవడం, వీటిని సలాడ్స్‌లో గార్నిష్‌ కోసం వాడడం, బ్రెడ్‌-స్మూతీస్‌-సూప్స్‌ తయారీలో భాగం చేయడం.. ఇలా నల్ల నువ్వులను ఎన్నో రకాలుగా వాడచ్చు.

⚛ రోజూ 2.5 గ్రాముల చొప్పున వీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.

⚛ ఇక ఇందులో ఉండే కొన్ని సమ్మేళనాలు క్యాన్సర్, గుండె జబ్బులు.. వంటి సమస్యలు దరిచేరకుండా కాపాడతాయి.

⚛ నల్ల నువ్వుల్లో విటమిన్‌ ‘బి’, జింక్‌, మెగ్నీషియం, కాపర్‌, అన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచుతాయి.

⚛ ఎండ వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలన్నా, జుట్టు ఒత్తుగా పెరగాలన్నా నల్ల నువ్వుల్ని ఆహారంలో చేర్చుకోవడంతో పాటు దీంతో తయారుచేసిన నూనెను కూడా ఉపయోగించడం మంచిదంటున్నారు నిపుణులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని