అయితేనేం.. మైదానంలో మనమే హీరో...
చిన్నప్పటి నుంచి బొద్దుగా ఉండటంతో బరువు తగ్గు అంటూ.. అమ్మ రోజూ సతాయించేది. అలా అడగడం కూడా అమ్మ తప్పు కాదు.
చిన్నప్పటి నుంచి బొద్దుగా ఉండటంతో బరువు తగ్గు అంటూ.. అమ్మ రోజూ సతాయించేది. అలా అడగడం కూడా అమ్మ తప్పు కాదు. ఏ తల్లైనా.. పిల్లలను అందంగా, ఆరోగ్యంగా చూడాలనుకుంటుంది. స్కూల్‌లో బాడీ షేమింగ్‌కు గురైనా.. లెక్కచేసేదాన్ని కాదు. ఎందుకంటే మైదానంలో మనమే హీరో. అయితే ఫ్యాషన్‌టెక్నాలజీ చదువుతున్నప్పుడు మాత్రం అందరూ బొద్దుగా ఉన్న నన్ను వింతగా చూసేవారు. సినిమారంగంలో నా నటన గురించి మాట్లాడటం కన్నా.. అధికబరువుపై విమర్శించేవారే ఎక్కువ. శరీరతత్వం, వర్ణం, ఎత్తు కాకుండా వారి వ్యక్తిత్వం, నైపుణ్యాలకు ప్రాముఖ్యతనివ్వాలి. నేను ఎవరికోసమో కడుపు మాడ్చుకోను. నచ్చింది తిని, దానికి తగ్గ వ్యాయామాలు చేస్తా. ఎవరో ఏదో అంటున్నారని వాళ్లకిష్టమైనట్లు మనం ఉండటానికి ప్రయత్నించకుండా మన మనసుకు నచ్చినట్లు జీవించడంలోనే అసలైన సంతోషం ఉంటుంది.
-సోనాక్షి సిన్హా, బాలీవుడ్ నటి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.