వధువులూ.. ఈ పొరపాట్లు చేయకండి!
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఎంతో ప్రత్యేకం. అందుకే అలాంటి మరపురాని రోజున అందరి కంటే అందంగా మెరిసిపోవాలని వధువులు కోరుకోవడం సహజం. వివిధ సౌందర్య చిట్కాలు పాటిస్తూ.....
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఎంతో ప్రత్యేకం. అందుకే అలాంటి మరపురాని రోజున అందరి కంటే అందంగా మెరిసిపోవాలని వధువులు కోరుకోవడం సహజం. వివిధ సౌందర్య చిట్కాలు పాటిస్తూ కొన్ని నెలల ముందు నుంచే అందుకు సిద్ధమవుతుంటారు అమ్మాయిలు. అయితే ఈ క్రమంలో తెలిసో, తెలియకో చేసే కొన్ని పొరపాట్లు కొత్త పెళ్లి కూతుళ్ల అందాన్ని దెబ్బతీస్తాయంటున్నారు నిపుణులు. మరి, అలా జరగకుండా ఉండాలంటే.. ఆ పొరపాట్లేంటో తెలుసుకొని.. అవి జరగకుండా ముందు జాగ్రత్తపడడం మంచిది.
ప్యాచ్ టెస్ట్ తప్పనిసరి..
పెళ్లి రోజు అందంగా కనిపించడానికి కొన్ని రోజుల ముందు నుంచే అమ్మాయిలు పార్లర్లకు వెళ్లడం చూస్తుంటాం. ఈ క్రమంలో ఎక్కువమంది ఫేషియల్పైనే దృష్టి పెడుతుంటారు. అయితే ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే మనం చేయించుకునే ఫేషియల్‌లో ఉపయోగించే ఉత్పత్తులు చర్మానికి పడకపోతే లేనిపోని సమస్యలొస్తాయి. కాబట్టి మీరు చేయించుకోవాలనుకునే ఫేషియల్ ఏదో ముందు నిర్ణయించుకొని.. దానికి సంబంధించిన ఉత్పత్తుల్ని ప్యాచ్ టెస్ట్ చేసుకొని.. ఆ తర్వాత ముందుకెళ్లడం మంచిది. ఈ శ్రమంతా ఎందుకు అనుకునే వాళ్లు.. పండ్ల గుజ్జుతో ఇంట్లోనే స్వయంగా ఫేషియల్ చేసుకోవచ్చు. ఇవి సహజసిద్ధమైనవి కాబట్టి దుష్ప్రభావాలు కూడా తలెత్తవు.
కురుల సంరక్షణ ఇలా..
పెళ్లిలో మాత్రమే కాదు.. మెహెందీ, హల్దీ.. వంటి ముందస్తు పెళ్లి వేడుకల్లో, రిసెప్షన్లో.. వివిధ రకాల హెయిర్‌స్టైల్స్‌తో ఆకట్టుకుంటున్నారు ఈతరం పెళ్లికూతుళ్లు. ఇలా వెంటవెంటనే విభిన్న హెయిర్‌స్టైల్స్‌ని ప్రయత్నించడం వల్ల జుట్టు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఎక్కువ! కాబట్టి ఇలా జరగకుండా జుట్టు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. హెన్నా, ఇతర సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి తయారుచేసిన హెయిర్‌ప్యాక్‌లు వేసుకోవడం, పెళ్లికి ముందు హెయిర్ స్పా చేయించుకోవడం.. వల్ల జుట్టు పట్టులా, ప్రకాశవంతంగా మెరుస్తుంది. తద్వారా పెళ్లిలో చక్కని చుక్కలా కనిపించేయచ్చు.
మచ్చలు తగ్గాలంటే..
మొటిమలు, మచ్చలు.. చాలామంది అమ్మాయిలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక పెళ్లి సమయం దగ్గరపడే కొద్దీ వాటిని దూరం చేసుకోవడానికి బయట దొరికే క్రీముల్ని వాడుతుంటారు కొందరు. దానివల్ల సమస్య తగ్గకపోగా.. కొత్త సమస్య తలెత్తే ప్రమాదమే ఎక్కువ. కాబట్టి ఇలాంటప్పుడు సొంత వైద్యం కాకుండా నిపుణుల్ని సంప్రదించి సలహాలు తీసుకోవడం మంచిది. అలాగే ఇంట్లో ఉండే బొప్పాయి, స్ట్రాబెర్రీ.. వంటి పండ్లతో తయారుచేసిన ఫేస్‌ప్యాక్స్‌తో సహజసిద్ధంగానే అందంగా మెరిసిపోవచ్చు.
చేతులు, పాదాలు కోమలంగా..!
చర్మం, కురుల విషయంలో తీసుకున్న శ్రద్ధ చేతులు, పాదాల విషయంలో తీసుకోం. కాబోయే వధువులు ఈ పొరపాటే చేయద్దంటున్నారు నిపుణులు. నఖశిఖపర్యంతం అందంగా కనిపించడంలో వీటి పాత్ర కూడా కీలకమే! కాబట్టి రోజూ రాత్రి నిద్రపోయే ముందు చేతులను ఆలివ్ నూనెతో మర్దన చేసుకోవాలి. అలాగే పాదాలకు పగుళ్లు లేకుండా చూసుకోవాలి. దీనికోసం స్నానం చేసే సమయంలో ప్యూమిస్ స్టోన్‌తో పాదాలను రుద్దుకోవాలి. వీటితో పాటు పెళ్లికి ముందు మ్యానిక్యూర్, పెడిక్యూర్.. వంటి చికిత్సలు మేలు చేస్తాయి.
క్రాష్ డైటింగ్ వద్దు..
పెళ్లి నిశ్చయమైన తర్వాత చాలామంది నాజూకైన శరీరాకృతి కోసం కష్టపడుతుంటారు. దీనికోసం క్రాష్ డైటింగ్ చేయడం లేదా ఎక్కువ సమయం జిమ్‌లో గడపడం.. వంటివి చేస్తుంటారు. దీనివల్ల పెళ్లి సమయం దగ్గర పడేటప్పటికి అలసిపోయినట్లుగా, బక్కచిక్కినట్లుగా కనిపిస్తారు. అందుకే ఇలాంటి ప్రయత్నాలు మాని.. నిపుణుల సూచనల మేరకు చక్కటి పోషకాహారం తీసుకోవాలి. అలాగే బరువు తగ్గాలనుకునే వారు నడక, పరుగు, జాగింగ్, ఈత.. వంటి తేలికపాటి వ్యాయామాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఒత్తిడికి దూరంగా..
వివాహ సమయం చేరువయ్యే కొద్దీ కాస్త ఒత్తిడిగా అనిపించడం సహజం. అయితే ఇలాంటి మానసిక సమస్యలు కూడా అందంపై ప్రతికూల ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం రోజూ పావుగంట ధ్యానం చేయడం మంచిదంటున్నారు. దీనివల్ల శరీరంలో ఫీల్‌గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. తద్వారా లోలోపలి నుంచి అందంగా మెరిసిపోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!