మా పాపకు 20 ఏళ్లు.. ఈ వయసులో మెల్లకన్నుని సరిచేయచ్చా?

మా అమ్మాయి వయసు 20 సంవత్సరాలు. తనకు పుట్టుకతోనే మెల్లకన్ను ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు తను ఒకవైపుకే చూస్తున్నట్టుగా....

Published : 05 May 2023 13:28 IST

మా అమ్మాయి వయసు 20 సంవత్సరాలు. తనకు పుట్టుకతోనే మెల్లకన్ను ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు తను ఒకవైపుకే చూస్తున్నట్టుగా ఉంది. ఈ వయసులో మెల్లకన్నుకి శాశ్వత పరిష్కారం ఉంటుందా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. పిల్లలకు చిన్నతనంలోనే మెల్ల ఉన్న విషయాన్ని గమనిస్తే తప్పనిసరిగా డాక్టర్‌ని సంప్రదించాలి. మీ పాపకు ‘ఐ సైట్‌’ ఎక్కువగా ఉండి.. క్రాస్‌ అయిన కన్ను చూపు తక్కువగా ఉందా? అన్న విషయాన్ని నిర్ధారించాలి. ఇలాంటి సమస్యను ‘లేజీ ఐ’ అని కూడా అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు చూపు బాగా ఉన్న కన్నుని మూసేసి మెల్ల ఉన్న కన్నుని కొంచెం స్టిమ్యులేట్‌ చేస్తుంటారు.

సాధారణంగా మెల్ల ఉన్నప్పుడు చూడడానికి ఒక కంటినే ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు కుడి వైపు కంటితో చూస్తున్నప్పుడు ఎడమవైపు కంటికి మెల్ల ఉంటుంది. ఎడమవైపు కంటితో చూసినప్పుడు కుడి వైపు కంటికి మెల్ల ఉంటుంది. ఒకవేళ రెండు కళ్లతో ఒకేసారి చూసినప్పుడు మెదడు దాన్ని డబుల్‌ విజన్‌గా గుర్తించి రెండు వస్తువుల్లాగా చూపిస్తుంది. ఇలా ఒక కంటితో చూడడం వల్ల అవతలి వారికి అందవికారంగా కనిపిస్తుంటుంది. అలాగే రెండు కళ్లూ ఒకేసారి ఉపయోగించకపోవడం వల్ల కొన్ని రకాల వస్తువులను చూసే అవకాశం ఉండదు. అంటే వీరు త్రీ డైమెన్షన్స్‌ను చూడలేరు. ఉదాహరణకు- త్రీడీ సినిమా చూస్తున్నప్పుడు మామూలు వారికి వచ్చే అనుభూతి మెల్ల ఉన్నవాళ్లకు కలగదు. ఇలాంటప్పుడు స్క్వింట్‌ని తప్పనిసరిగా కరెక్ట్ సరి చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి, ఇప్పటికైనా స్క్వింట్‌ డాక్టర్‌ని సంప్రదించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని