Birth Control Pills: గర్భ నిరోధక మాత్రల వల్ల బీపీ పెరుగుతుందా?

నేను బర్త్‌ కంట్రోల్‌ పిల్స్ వాడదామనుకుంటున్నాను. అయితే ఆ పిల్స్‌ వాడడం వల్ల బీపీ పెరుగుతుందని విన్నాను. ఇప్పటికే నాకు బీపీ ఉంది. బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవడం కోసం ట్యాబ్లెట్‌ వేసుకోవడంతో పాటు వాకింగ్‌ చేస్తున్నాను

Updated : 31 Jul 2023 22:03 IST

నేను బర్త్‌ కంట్రోల్‌ పిల్స్ వాడదామనుకుంటున్నాను. అయితే ఆ పిల్స్‌ వాడడం వల్ల బీపీ పెరుగుతుందని విన్నాను. ఇప్పటికే నాకు బీపీ ఉంది. బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవడం కోసం ట్యాబ్లెట్‌ వేసుకోవడంతో పాటు వాకింగ్‌ చేస్తున్నాను. బర్త్‌ కంట్రోల్‌ పిల్స్ బీపీని పెంచుతాయా? పిల్స్‌ కాకుండా ఇంకా మంచి పద్ధతులు ఏమైనా ఉన్నాయా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీకు ఇప్పటికే బీపీ ఉందని చెబుతున్నారు. బర్త్‌ కంట్రోల్‌ పిల్స్‌లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్ కంటెంట్‌ ఉన్నవి. రెండోది.. కేవలం ప్రొజెస్టిరాన్‌ ఉన్నవి. ఈస్ట్రోజెన్‌ ఉన్న పిల్స్‌ ఉపయోగించడం వల్ల కొంతమందిలో బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ ఉన్న పిల్స్‌కు దూరంగా ఉండడం మంచిది. వాటికి బదులుగా కేవలం ప్రొజెస్టిరాన్‌ ఉన్న పిల్స్‌ ఉపయోగించండి. అయితే వీటిని వాడే ముందు ఒకసారి మీ వ్యక్తిగత వైద్యుని సంప్రదించండి. పిల్స్ కాకుండా ఇతర పద్ధతుల గురించి అడిగారు. ఇందుకోసం హార్మోనల్ ఐయూడీలు, కాపర్‌ టీ లూప్స్.. వంటి పద్ధతులను ఆశ్రయించవచ్చు. దీనికోసం కూడా ఒకసారి మీ వ్యక్తిగత వైద్యుని సంప్రదించి కాంట్రసెస్టివ్‌ కౌన్సెలింగ్‌ తీసుకోండి. దాన్ని బట్టి ఏ పద్ధతిని ఎంచుకోవాలో తెలుస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని