గర్భ నిరోధక మాత్రలు వాడితే బీపీ పెరుగుతుందా?

నేను గర్భ నిరోధక మాత్రలు వాడదామనుకుంటున్నాను. అయితే ఆ పిల్స్‌ వాడడం వల్ల బీపీ పెరుగుతుందని విన్నాను. ఇప్పటికే నాకు బీపీ ఉంది. నియంత్రణలో ఉండడం కోసం ట్యాబ్లెట్‌ వేసుకోవడంతో పాటు వాకింగ్‌ చేస్తున్నాను. ఈ క్రమంలో గర్భ నిరోధక మాత్రలు వాడితే  బీపీ పెరుగుతుందా?

Published : 19 Jun 2024 13:10 IST

నేను గర్భ నిరోధక మాత్రలు వాడదామనుకుంటున్నాను. అయితే ఆ పిల్స్‌ వాడడం వల్ల బీపీ పెరుగుతుందని విన్నాను. ఇప్పటికే నాకు బీపీ ఉంది. నియంత్రణలో ఉండడం కోసం ట్యాబ్లెట్‌ వేసుకోవడంతో పాటు వాకింగ్‌ చేస్తున్నాను. ఈ క్రమంలో గర్భ నిరోధక మాత్రలు వాడితే  బీపీ పెరుగుతుందా? గర్భం రాకుండా ఉండడానికి మాత్రలకు బదులు ఇంకా మంచి పద్ధతులు ఏమైనా ఉన్నాయా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీకు ఇప్పటికే బీపీ ఉందని చెబుతున్నారు. గర్భ నిరోధక మాత్రలలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ ఉన్నవి. రెండోది.. కేవలం ప్రొజెస్టరాన్ ఉన్నవి. ఈస్ట్రోజెన్‌ ఉన్న పిల్స్‌ ఉపయోగించడం వల్ల కొంతమందిలో బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ ఉన్న పిల్స్‌కు దూరంగా ఉండడం మంచిది. వాటికి బదులుగా కేవలం ప్రొజెస్టరాన్ ఉన్న పిల్స్‌ ఉపయోగించండి. అయితే వీటిని వాడే ముందు ఒకసారి మీ వ్యక్తిగత వైద్యుని సంప్రదించండి. పిల్స్ కాకుండా ఇతర పద్ధతుల గురించి అడిగారు. ఇందుకోసం హార్మోనల్ ఐయూడీలు, కాపర్‌ టీ లూప్స్.. వంటి పద్ధతులను ఆశ్రయించవచ్చు. దీనికోసం కూడా ఒకసారి మీ వ్యక్తిగత వైద్యుని సంప్రదించి కాంట్రాసెస్టివ్‌ కౌన్సెలింగ్‌ తీసుకోండి. దాన్ని బట్టి ఏ పద్ధతిని ఎంచుకోవాలో తెలుస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్