ప్లాస్టిక్‌ వస్తువులు ఉపయోగిస్తే క్యాన్సర్‌ వస్తుందా?

ఈ రోజుల్లో ప్లాస్టిక్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్లాస్టిక్‌ ప్లేట్లు, ప్లాస్టిక్‌ కప్పులు, ప్లాస్టిక్‌ గ్లాసులు ఎక్కువగా ఉపయోగిస్తున్నాం కదా..! ఇలా ఎక్కువగా ప్లాస్టిక్‌ వస్తువులు ఉపయోగిస్తే క్యాన్సర్‌ వస్తుందని వింటుంటాం. ఇది నిజమేనా? వీటిని వాడే విషయంలో ఎలాంటి...

Updated : 14 Apr 2023 10:25 IST

ఈ రోజుల్లో ప్లాస్టిక్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్లాస్టిక్‌ ప్లేట్లు, ప్లాస్టిక్‌ కప్పులు, ప్లాస్టిక్‌ గ్లాసులు ఎక్కువగా ఉపయోగిస్తున్నాం కదా..! ఇలా ఎక్కువగా ప్లాస్టిక్‌ వస్తువులు ఉపయోగిస్తే క్యాన్సర్‌ వస్తుందని వింటుంటాం. ఇది నిజమేనా? వీటిని వాడే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. సాధారణంగా ఈ ప్రశ్నను చాలామంది అడుగుతుంటారు. ప్లాస్టిక్‌, క్యాన్సర్‌ మధ్య ఉన్న సంబంధంలో ప్లాస్టిక్ తయారీలో వాడే రసాయన సమ్మేళనాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్లాస్టిక్ తయారీకి సంబంధించిన పరిశ్రమలలో ఈ సమ్మేళనాలు గ్యాస్ రూపంలో బయటకు వస్తుంటాయి. వాటిని పీల్చినప్పుడు కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని శాస్త్రీయంగా నిరూపితమైంది.

ఇక మన రోజువారీ జీవితంలో ఫుడ్ గ్రేడ్ కాని ప్లాస్టిక్‌ వస్తువుల్లో వేడి పదార్థాలను ఎక్కువసేపు ఉంచి వాటిని తీసుకున్నప్పుడు కొంత ప్లాస్టిక్‌ కరిగి జీర్ణకోశంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి, ఫుడ్ గ్రేడ్ కాని ప్లాస్టిక్‌ వస్తువుల్లో వేడి పదార్థాలను పెట్టకపోవడం, అవెన్‌లో పెట్టి వేడి చేయకపోవడం, అలాంటి వస్తువులను వాడకపోవడం మంచిది. అలాగే క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలను విడుదల చేసే పరిశ్రమలకు దూరంగా ఉండడం అన్ని రకాలుగానూ మంచిది. మొత్తం మీద- ఏ రకంగా అయినా సరే- ప్లాస్టిక్ వినియోగానికి సాధ్యమైనంతవరకు దూరంగా ఉండడం శ్రేయస్కరం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్