Published : 21/12/2022 21:09 IST

ఆ సప్లిమెంట్స్ వాడితే చర్మం మెరుస్తుందా?

నా వయసు 20 సంవత్సరాలు. నా చర్మం జిడ్డుగా ఉంటుంది. విటమిన్‌ E సప్లిమెంట్స్‌ తీసుకోవడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారే అవకాశం ఉందంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? జిడ్డు తగ్గాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - ఓ సోదరి

జ. విటమిన్‌ E యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. చర్మంలోని హానికర ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. కాబట్టి, దీనివల్ల ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఈ సప్లిమెంట్స్‌ను నెలల తరబడి ఉపయోగించకూడదు. ఎందుకంటే, ఇది కొవ్వులో కరిగే విటమిన్‌. వీటిని ఎక్కువ రోజులు బయట నుంచి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి, సాధ్యమైనంత వరకు ఈ విటమిన్‌ను సహజంగా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇందుకోసం విటమిన్‌ E అధికంగా ఉండే పొద్దుతిరుగుడు గింజలు, హేజల్‌ నట్స్‌, బాదంతో పాటు బ్రకలీ వంటి గ్రీన్‌ వెజిటబుల్స్‌ను ఆహారంలో భాగం చేసుకోండి. అలాగే సీజనల్‌ ఫ్రూట్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉండే మొలకలను తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

అలాగే సౌందర్య ఉత్పత్తుల ఎంపికలో జాగ్రత్త వహించాలి. ఏ ప్రొడక్ట్‌ తీసుకున్నా అది జిడ్డు చర్మానికి తగ్గట్టుగా ఉండే విధంగా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ సరైన ఆహారం తీసుకుంటే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని