ప్రయాణాల్లో.. టాయిలెట్ ఇన్ఫెక్షన్లు రాకుండా..!

వ్యక్తిగత పరిశుభ్రత.. ఈ విషయంలో ఇంటి దగ్గర ఎలా ఉన్నా, బయటకు వెళ్లినప్పుడు మాత్రం అన్ని సందర్భాల్లోనూ ఇది సాధ్యం కాకపోవచ్చు. ఈ క్రమంలో ప్రత్యేకించి ప్రయాణాలు చేసేటప్పుడు అత్యవసర సమయంలో ఉపయోగించుకోవడానికి వీలుగా కొన్ని ఉత్పత్తులను అందుబాటులో ఉంచుకోవాలంటున్నారు నిపుణులు.

Published : 25 Jun 2024 11:59 IST

వ్యక్తిగత పరిశుభ్రత.. ఈ విషయంలో ఇంటి దగ్గర ఎలా ఉన్నా, బయటకు వెళ్లినప్పుడు మాత్రం అన్ని సందర్భాల్లోనూ ఇది సాధ్యం కాకపోవచ్చు. ఈ క్రమంలో ప్రత్యేకించి ప్రయాణాలు చేసేటప్పుడు అత్యవసర సమయంలో ఉపయోగించుకోవడానికి వీలుగా కొన్ని ఉత్పత్తులను అందుబాటులో ఉంచుకోవాలంటున్నారు నిపుణులు. మరి, ఆ ఉత్పత్తులేంటో తెలుసుకుందామా...

ఇంటిమేట్‌ వైప్స్...

బయటి ప్రదేశాలు, విహారయాత్రలకు వెళ్లినప్పుడు కొన్ని సందర్భాల్లో టాయిలెట్ల సౌకర్యం ఉండదు. మరికొన్ని సందర్భాల్లో శుభ్రమైన నీరు లభించదు. ఇలాంటప్పుడు జననేంద్రియాలను శుభ్రం చేసుకోవడానికి ఇంటిమేట్‌ వైప్స్‌ చక్కగా ఉపయోగపడతాయి. మార్కెట్లో పలు బ్రాండ్లలో ఇలాంటివి లభ్యమవుతున్నాయి. ఈ వైప్స్‌లో కెమికల్స్‌ కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకోవడం మంచిది. అత్యవసర సమయంలో చక్కగా ఉపయోగపడతాయి. అయితే వీటిని ఉపయోగించే ముందు ఒకసారి ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.

ఇంటిమేట్‌ పౌడర్లు..

విహారయాత్రలకు వెళ్లినప్పుడు విభిన్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల చల్లగా ఉంటే మరికొన్ని చోట్ల ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు చెమట అధికంగా వస్తుంది. ఫలితంగా ర్యాషెస్‌, అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తిగత భాగాలను పొడిగా ఉంచుకోకపోతే ఈ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇందుకోసం ఇంటిమేట్‌ పౌడర్‌ని వెంట తీసుకెళ్లడం ఉత్తమం. వాతావరణం ఉక్కపోతగా ఉన్నప్పుడు ఇది చక్కగా పనిచేస్తుంది.

టాయిలెట్‌ శానిటైజర్స్...

టూర్‌కి వెళ్లినప్పుడు ఇతరులు ఉపయోగించిన వాష్‌రూమ్‌లనే ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. టాయిలెట్‌ సీట్‌ స్ప్రే శానిటైజర్ దీనికి చక్కటి పరిష్కారం. దీనిని టాయిలెట్‌ సీట్‌పై కూర్చునే ముందు ఉపయోగించాలి. ఫలితంగా టాయిలెట్‌ ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. ఇందులో సువాసనలు వెదజల్లే ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. కాబట్టి వాష్‌రూమ్‌ నుంచి వచ్చే దుర్వాసన రాకుండా ఉంటుంది. ఇవి ఆన్‌లైన్‌లోనూ లభ్యమవుతున్నాయి.

టాయిలెట్‌ సీట్‌ శానిటైజర్‌కి బదులుగా డిస్పోజబుల్‌ టాయిలెట్‌ సీట్‌ కవర్స్‌ని కూడా ఉపయోగించుకోవచ్చు. వీటిని ఒక్కసారి మాత్రమే ఉపయోగించే వీలుంటుంది. ఎక్కువ బరువు కూడా ఉండవు. తేలికగా తీసుకెళ్లొచ్చు. కాబట్టి, ప్రయాణాలు చేసేటప్పుడు వీటిని హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకోవడం మంచిది.

నిలబడే..

విహారయాత్రలకు వెళ్లినప్పుడు టాయిలెట్లు శుభ్రంగా లేకపోతే మహిళలుగా మనం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంటాం. అపరిశుభ్రమైన టాయిలెట్లను వాడడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్.. మొదలైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటికి పరిష్కారంగా మార్కెట్లో నిలబడి మూత్రవిసర్జన చేసే ఉత్పత్తులు లభ్యమవుతున్నాయి. వీటిని ఏ సమయంలోనైనా ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి, ప్రయాణాలు చేసేటప్పుడు వీటిని తీసుకెళ్లడం మంచిది. తద్వారా అత్యవసర సమయాల్లో ఉపయోగించుకోవచ్చు. ఇవి ఆన్‌లైన్‌లోనూ లభ్యమవుతున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్