చకా చకా తినేస్తారిక!

సెలవుల్లో ఇంట్లో ఉంటారు. ఇప్పుడు తినకపోతే మరికాసేపాగి తినిపిస్తాం. అవి చేసిపెడతాం, ఇవి కొనిపెడతామని తాయిలాలిచ్చో... కథలు చెప్పి బుజ్జగించో కడుపు నింపేస్తాం.

Published : 13 Jun 2024 02:55 IST

చలో స్కూల్‌

సెలవుల్లో ఇంట్లో ఉంటారు. ఇప్పుడు తినకపోతే మరికాసేపాగి తినిపిస్తాం. అవి చేసిపెడతాం, ఇవి కొనిపెడతామని తాయిలాలిచ్చో... కథలు చెప్పి బుజ్జగించో కడుపు నింపేస్తాం. మరి స్కూలుకెళితే? లంచ్‌బాక్స్‌ తెరవడానికీ ఆలోచిస్తుంటారు. అందుకే వాళ్లకి నచ్చేలా ఇలాంటివి తీసుకోండి. ఒకేదానిలో రెండు మూడు రకాలు పెట్టేలా ఇప్పుడు బెంటో బాక్స్‌లు వస్తున్నాయి. వాటిని పిల్లలను ఆకర్షించేలా ఇలా భిన్న డిజైన్లలో తీసుకొస్తున్నారు. వాటిని ఎంచుకోండి. లేదూ ఇంకాస్త ప్రత్యేకంగా ఉండాలి అనిపించిందా... పిల్లల పేర్లు, అభిరుచులకు తగ్గ స్టిక్కర్లు వేసిస్తున్న ‘జూమ్, టాట్‌డాట్, ఫొటోల్యాండ్‌’ లాంటి సంస్థలు ఎలాగూ ఉన్నాయి. వాటినైనా ఆశ్రయించొచ్చు. చిన్నారులను ఊహాలోకంలో విహరిస్తూ తినేలా చేసే వీటిని తెచ్చేయాలని మీకూ అనిపిస్తోందా మరి?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్