Clapping Therapy: నడుము నొప్పికి చప్పట్ల మందు!

ఆటల్లో, పోటీల్లో మనవారిని ఉత్తేజపరచడానికి చప్పట్లు కొడుతూ ఉంటాం.  క్లాపింగ్‌ థెరపీని రోజూ ఒక పది నిమిషాలు చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చట...

Updated : 04 Aug 2023 08:05 IST

ఆటల్లో, పోటీల్లో మనవారిని ఉత్తేజపరచడానికి చప్పట్లు కొడుతూ ఉంటాం.  క్లాపింగ్‌ థెరపీని రోజూ ఒక పది నిమిషాలు చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చట...

గుండె ఆరోగ్యానికి.. చప్పట్లు కొట్టడం వల్ల అరచేతులు వేడెక్కుతాయి. శరీరమంతా రక్తప్రసరణ సరిగా జరుగుతుంది. ఇది గుండె కండరాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. హృద్రోగాలు రాకుండా నివారిస్తుంది. శ్వాసకోస వ్యాధులను దూరం చేస్తుంది.

మానసిక ఆరోగ్యానికి.. మనం చప్పట్లు కొట్టేప్పుడు.. ఉత్పన్నమయ్యే శక్తి మనసుకు సానుకూల సంకేతాలను పంపుతుంది. నిరాశ, చంచలత్వం నుంచి బయటపడేస్తుంది. శరీరంలో సంతోషకర హార్మోన్లను విడుదల చేస్తుంది.

రోగనిరోధక శక్తికి.. చప్పట్లు శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతాయి. ఫలితంగా రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. దీనితో ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు

జ్ఞాపకశక్తికి.. ఈ థెరపీని పెద్దలు మాత్రమే కాదు పిల్లలూ చేయవచ్చు. చప్పట్లు కొట్టడం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

నడుము నొప్పికి.. నడుము నొప్పితో బాధపడేవారికి ఈ థెరపీ మంచి ఉపశమనం కలిస్తుంది. తుంటి కండరాలకు అనుసంధానంగా ఉన్న ఆక్యుప్రెజర్‌ పాయింట్లను ఉత్తేజితం చేస్తుంది. నొప్పి తీవ్రతను తగ్గిస్తుంది. ఎముక సంబంధిత సమస్యలూ తగ్గుతాయి.

ఎలా చేయాలి... పద్మాసనం లేదా వజ్రాసనంలో కూర్చోవాలి. రెండు చేతులను సమాంతరంగా చాచి చప్పట్లు కొట్టాలి. ఇలా ప్రతీ రోజూ ఉదయం, సాయంత్రం  ఇరవై నిమిషాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని