Madhuri Balodi: వ్యర్థాలతో కళాకృతులు!

అవసరం తీరాక ఖాళీ గాజుసీసాలను చెత్తబుట్టలో పడేస్తాం కదా! అదే దిల్లీ అమ్మాయి కవికి ఇచ్చి చూడండి. భోజనబల్ల, టీపాయ్‌పై అందమైన అలంకరణ వస్తువులుగా మార్చేస్తుంది.

Published : 08 Apr 2023 00:18 IST

అవసరం తీరాక ఖాళీ గాజుసీసాలను చెత్తబుట్టలో పడేస్తాం కదా! అదే దిల్లీ అమ్మాయి కవికి ఇచ్చి చూడండి. భోజనబల్ల, టీపాయ్‌పై అందమైన అలంకరణ వస్తువులుగా మార్చేస్తుంది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలన్నది ఈమె లక్ష్యం. అందుకోసమని వ్యర్థాల్ని తిరిగి ఉపయోగించుకునేలా తీర్చిదిద్దాలనుకుంది. అయిదేళ్ల క్రితం ‘కవి ద పొయిట్రీ-ఆర్ట్‌ ప్రాజెక్ట్‌’ను ప్రారంభించి.. వృథా గాజు సీసాలను ల్యాంప్‌, గ్లాసు, స్నాక్‌బౌల్‌.. ఇలా రకరకాలుగా మార్చేస్తోంది. అంతేకాదు.. ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచితే 80వేల మందికి పైగా కొనుక్కున్నారట. 1000 కార్పొరేట్‌ సంస్థలతో కలిసి పనిచేస్తున్న ఈమె 140 టన్నుల వ్యర్థాలను వస్తువులుగా మార్చి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులోనూ స్థానం సంపాదించుకుంది. తన సృజనాత్మకతతో 25 మందికి ఉపాధినీ కల్పిస్తోంది. ఆదరణ పెరుగుతున్న కొద్దీ ఇతర వ్యర్థాలపైనా దృష్టిపెడుతూ వెళుతున్న ఆమె.. కార్డ్‌బోర్డులతో మొక్కల కుండీలు, ఫొటోఫ్రేమ్‌లు వంటివీ తయారు చేస్తోంది. ఈమె ఆలోచనని మెచ్చుకోవాల్సిందే కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్