దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే..

దంతాలు తళతళా మెరిసిపోతూ, ఆరోగ్యంగా ఉండటంలో కేవలం టూత్‌పేస్ట్ మాత్రమే కాదు.. మనం తీసుకునే ఆహారం పాత్ర కూడా చాలానే ఉంటుంది. మరి అవేంటో మీకూ తెలుసుకోవాలనుందా?? అయితే ఇది చదవండి..

Updated : 09 Nov 2021 20:49 IST

దంతాలు తళతళా మెరిసిపోతూ, ఆరోగ్యంగా ఉండటంలో కేవలం టూత్‌పేస్ట్ మాత్రమే కాదు.. మనం తీసుకునే ఆహారం పాత్ర కూడా చాలానే ఉంటుంది. మరి అవేంటో మీకూ తెలుసుకోవాలనుందా?? అయితే ఇది చదవండి..

నిమ్మజాతి పండ్లు

విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మజాతి పండ్లు రక్తనాళాలను బలంగా చేసి చిగుళ్లు, దంతాల దృఢత్వాన్ని పెంచుతాయి. కాబట్టి ద్రాక్ష, నిమ్మ, ఆరెంజ్.. లాంటి నిమ్మజాతి పండ్లను ఎక్కువగా ఆహారంలో భాగంగా తీసుకోవాలి.

పాలు

పాలల్లో అధిక మొత్తంలో క్యాల్షియం ఉండటం వల్ల కేవలం ఎముకలే కాదు.. దంతాలు కూడా దృఢంగా తయారవుతాయి. కాబట్టి క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం దంతాల ఆరోగ్యానికి చాలా అవసరం.

ఎక్కువ మొత్తంలో నీరు

నీరు కూడా దంతాల ఆరోగ్యంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇది దంతాల మధ్య ఇరుక్కుపోయిన ఆహారాన్ని తొలగించి నోటిలో లాలాజలం స్థాయుల్ని పెంచుతుంది. లాలాజలంలో ఉండే నీరు, ప్రొటీన్లు, మినరల్స్ మొదలైనవి దంతాల్లో ఏవైనా సమస్యలుంటే తొలగించి దంతాల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగడం మంచిది.

పండ్లు, కూరగాయలు

క్యాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండే పెరుగు; పాలు, నట్స్, గుడ్లు, మాంసం.. లాంటి న్యూట్రియంట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం దంతాల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. వీటితో పాటు తాజా పండ్లు, కూరగాయలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి.

నువ్వుల నూనెతో..

దంతాలపై ఏవైనా మరకలుంటే నువ్వుల నూనెతో పుక్కిలించాలి. దీంతో దంతాలు శుభ్రపడటంతో పాటు కోల్పోయిన ఖనిజాలు తిరిగి అందుతాయి.

చేపలు

విటమిన్ డి ఎక్కువగా ఉండే సాల్మన్ చేపలు తినడం వల్ల కూడా దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది దంతాలకు ఎలాంటి వ్యాధులు సోకకుండా రక్షణనిస్తుంది.

చీజ్..

చీజ్‌లో క్యాల్షియం ఎక్కువగా.. చక్కెరలు, యాసిడ్లు తక్కువగా ఉంటాయి.. కాబట్టి ఇది దంతాల ఆరోగ్యానికి అవసరమైన ఆహారం. దీన్ని కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి.

చూయింగ్ గమ్స్..

అప్పుడప్పుడు షుగర్ ఫ్రీ గమ్స్ నమలడం కూడా దంతాల ఆరోగ్యానికి మంచిదే. ఎందుకంటే వీటిని నమలడం వల్ల పంటికి మంచి ఎక్సర్‌సైజ్‌తో పాటు పళ్ల చుట్టూ ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా తొలగించి దంతాల ఎనామిల్‌ను యాసిడ్స్ నుంచి కాపాడతాయి.

మరికొన్ని..

* పచ్చి ఉల్లిగడ్డల్ని తింటే అందులో ఉండే యాంటీ మైక్రోబియల్ సల్ఫర్ వల్ల దంతాల్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది.

* క్రాన్‌బెర్రీస్‌లో ఉండే పాలీఫినోల్స్ దంతాల పైన పడిన మరకల్ని పోగొడతాయి. దీనివల్ల ఎలాంటి దంత సమస్యలు రాకుండా ఉంటాయి.

* యాపిల్, క్యారట్.. లాంటి గట్టిగా ఉండే పళ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకుంటే దంతాలపై ఉండే మరకలు తొలగిపోయి శుభ్రపడతాయి.

* గ్రీన్ టీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి దంతాలను రక్షిస్తుంది.

* ఫోలికామ్లం నోటిని తాజాగా ఉంచి శరీరంలో కొత్త కణాలు ఏర్పడటంలో తోడ్పడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్