ఏ కౌగిలింతలో ఏం అర్థముందో?
close
Updated : 12/02/2022 17:21 IST

ఏ కౌగిలింతలో ఏం అర్థముందో?!

బాధైనా, సంతోషమైనా బిగి కౌగిలింతతో ఎదుటి వారితో పంచుకోవడం మనకు అలవాటే! తద్వారా మనసులోని భావోద్వేగాలు అదుపులోకొస్తాయని చెబుతున్నారు నిపుణులు. నిజంగానే కౌగిలింతకు అంత పవర్‌ ఉంది మరి! మనిషి మూడ్‌ని మార్చేసే శక్తి హగ్‌లో ఉందని ఇప్పటికే పరిశోధకులు శాస్త్రీయంగా నిరూపించారు కూడా! వేలంటైన్స్‌ వీక్‌లో భాగంగా ఫిబ్రవరి 12ను ‘హగ్‌ డే’గా జరుపుకోవడం మనకు తెలిసిందే. ఈ ప్రత్యేకమైన రోజున తమకు నచ్చిన వ్యక్తులను ఆప్యాయంగా కౌగిలించుకొని తమ ప్రేమను వ్యక్తం చేస్తారు ప్రేమపక్షులు. మరి, ఆప్యాయంగా ఇచ్చే ఈ కౌగిలింతలో ఎన్నో రకాలు, వాటికి మరెన్నో అర్థాలున్నాయన్న విషయం మీకు తెలుసా? ఏ హగ్‌కు ఏ అర్థముందో నిపుణుల మాటల్లోనే తెలుసుకుందాం రండి..

వెనక నుంచి హత్తుకుంటే..

ఒక వ్యక్తి మిమ్మల్ని వెనక నుంచి హత్తుకున్నారంటే మీ రక్షణ గురించి వాళ్లు ఎంతో నిబద్ధతతో ఉన్నారని అర్థం. సహజంగా కేవలం ప్రేమికులు లేదా భార్యభర్తల్లోనే ఇలాంటి కౌగిలింతలు కనిపిస్తుంటాయి. ఒకవేళ మాటల్లో చెప్పలేకపోతున్నా ఓ వ్యక్తి మిమ్మల్ని వెనకాల నుంచి గట్టిగా కౌగిలించుకున్నారంటే వారికి మీపై ఎంతో ప్రేమ, నమ్మకం ఉన్నాయని అర్థమట!

బిగి కౌగిలింత

ఒక వ్యక్తిని ఎన్నో రోజుల తర్వాత కలుసుకోవడమో లేక వారిని విడిపోవడానికి ఇష్టపడనప్పుడో గట్టిగా కౌగిలించుకోవడం మనకు తెలిసిందే. దీనినే ‘బేర్‌ హగ్‌’గా పిలుస్తారు. ఒక వ్యక్తి మిమ్మల్ని ఇలా హగ్‌ చేసుకుంటే వారికి మీపై ఎంతో ప్రేమ ఉందని అర్థం. ఇది కేవలం ప్రేమికులు, భార్యాభర్తలు, తల్లీపిల్లల మధ్యే కాకుండా.. స్నేహితులు, బంధువుల మధ్య కూడా ఉంటుంది. ‘నిన్ను విడిచి నేను ఉండలేను.. నీకు దూరం కాలేను’ అని చెప్పడానికి కూడా ఇలా కౌగిలించుకుంటారట.

వీపు నిమరడం..

కౌగిలించుకున్న తర్వాత వీపుపై నిమరడం మనలో చాలామందికి అనుభవమే. ఇలా హగ్‌ చేసుకుంటున్నారంటే వారు మీ సంరక్షకులని అర్థం. సహజంగా తల్లిదండ్రులు లేదా పెద్దవాళ్లు చిన్నారులను ప్రోత్సహిస్తున్న సమయంలో, వారిని ఓదార్చుతున్న సమయంలో ఇలాంటి కౌగిలింతలు సర్వసాధారణమే.

మర్యాదగా..

మోముపై సంతోషం, చిరునవ్వుతో ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడాన్ని ‘పొలైట్‌ హగ్‌’గా పిలుస్తారు. ఇలాంటి కౌగిలింతలు సాధారణంగా స్నేహితులు, పేరెంట్స్‌-చిన్నారులకు మధ్య కనిపిస్తుంటాయి. ఇలా ఎవరైనా మిమ్మల్ని కౌగిలించుకుంటే ‘నీకు నేనున్నాననే భరోసా ఇస్తున్నట్లు’ అర్థం.

కళ్లతో కౌగిలింత

ఒక వ్యక్తి మీ కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ కౌగిలించుకుంటున్నారంటే అతనికి/ఆమెకు మీపై పిచ్చి ప్రేమ ఉందని అర్థం. మీతో పీకల్లోతు ప్రేమలో ఉంటేనే ఇలాంటి హగ్‌ ఇస్తారు. శరీరాలు పెనవేసుకుంటూ, కళ్లతో మాట్లాడుకుంటూ ఇచ్చుకునే ఈ హగ్‌.. ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని తెలుపుతుంది.

శరీరాలు పెనవేసుకోకుండా..

శరీరాలు పెనవేసుకోకుండా కేవలం ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేస్తూ ఆలింగనం చేసుకోవడాన్ని ‘లండన్‌ బ్రిడ్జ్‌ హగ్‌’గా పేర్కొంటారు. ఇలా కౌగిలించుకునే వారి మధ్య స్వచ్ఛమైన స్నేహబంధం తప్ప మరే బంధం ఉండదని చెబుతున్నారు నిపుణులు.

నడుముపై చేతులేసి..

నడుముపై చేతులు వేసి కౌగిలించుకునే వారితో జాగ్రత్తగా ఉండాలట. ప్రేమించాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్న వారు ఇలా హగ్‌ చేసుకుంటారని రిలేషన్‌షిప్‌ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారు ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతారట!


Advertisement

మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి