Sweat Pads: వీటితో చెమట వాసన ఉండదిక!

వేసవిలో చెమట ఎక్కువగా రావడం సహజం. చాలామంది మహిళలు చంకల కింద అధిక చెమటతో ఇబ్బంది పడిపోతుంటారు. ఫలితంగా దుర్వాసన, దుస్తులపై చెమట మరకలు పడడం.. వంటి సమస్యలు...

Published : 09 May 2023 19:55 IST

వేసవిలో చెమట ఎక్కువగా రావడం సహజం. చాలామంది మహిళలు చంకల కింద అధిక చెమటతో ఇబ్బంది పడిపోతుంటారు. ఫలితంగా దుర్వాసన, దుస్తులపై చెమట మరకలు పడడం.. వంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు. దీంతో నలుగురిలోకి వెళ్లడమూ ఇబ్బందిగానే ఉంటుంది. ఇలాంటి వాళ్లకు ‘స్వెట్‌ ప్యాడ్స్‌’ ప్రస్తుతం వరంగా పరిణమించాయని చెప్పాలి.

గుండ్రంగా, అండాకారంలో, ఫోల్డెడ్‌ షేప్‌.. ఇలా విభిన్న ఆకృతుల్లో ఉండే వీటిని ధరించే దుస్తులకూ అమర్చుకోవచ్చు.. లేదంటే నేరుగా చంకల కింద అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందులోనూ విభిన్న ప్రింట్స్‌, ఆకర్షణీయమైన రంగుల్లోనూ ఇవి లభిస్తున్నాయి. కాబట్టి ఆయా డ్రస్సుల రంగును బట్టి వీటిని ధరించచ్చు. ఇక వీటిలోనూ టీషర్ట్‌, బ్లౌజ్‌, డ్రస్‌.. వంటి విభిన్న దుస్తులకు అనుగుణంగా వేర్వేరు షేప్స్‌లో ఉన్నవీ ఎంచుకోవచ్చు. తిరిగి ఉపయోగించేవి, ఒకసారి వాడి పడేసేవి కూడా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. కాబట్టి మీకు నప్పిన, సౌకర్యవంతంగా ఉండే స్వెట్‌ ప్యాడ్స్‌ని ఎంచుకొని కంఫర్టబుల్‌గా మెరిసిపోవచ్చు.

Photos: Amazon.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్