Published : 28/10/2022 20:47 IST

ఈ క్యాండిల్స్‌తో ఆహ్లాదం.. ఆరోగ్యం..!

మనసుని ఆహ్లాదపరిచే సువాసనలతో, చూడచక్కని ఆకృతుల్లో ఆకట్టుకుంటాయి సుగంధ కొవ్వొత్తులు (సెంటెడ్‌ క్యాండిల్స్‌). వీటి నుంచి వచ్చే పరిమళాలు ఆరోగ్య ప్రయోజనాల్నీ అందిస్తాయట. మరి అవేంటో చూద్దామా!

లావెండర్‌ క్యాండిల్

ఇది చక్కని సువాసన మాత్రమే అందిస్తుందని అనుకుంటాం. కానీ ఈ కొవ్వొత్తుల నుంచి వచ్చే లావెండర్‌ పరిమళం ఒత్తిడి, కుంగుబాటు, అలసట, తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. నిద్రలేమితో బాధపడే వారికి ఇది చక్కని పరిష్కారం చూపుతుందంటారు నిపుణులు. ఇందుకోసం దీన్ని వెలిగించి పడకగదిలో పెట్టుకుంటే చాలు.

 


దాల్చిన చెక్క క్యాండిల్

దాల్చిన చెక్క క్యాండిల్‌ నుంచి వచ్చే ఘాటైన, తియ్యనైన వాసన గదిని సువాసనభరితం చేస్తుంది. మనసు ఉల్లాసంగా ఉండడంతో పాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది. దాల్చిన చెక్క వికారానికి చక్కని పరిష్కారం. దీన్ని పనిచేసే ప్రదేశంలో వెలిగిస్తే ఒత్తిడి అదుపులో ఉంటుంది.


పుదీనా క్యాండిల్

ఈ కొవ్వొత్తుల్ని గదిలో అక్కడక్కడా పెట్టడం వల్ల మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది. పిల్లలు చదువుకునే చోట ఉంచితే మంచిది.


మల్లె క్యాండిల్

దీన్నుంచి వచ్చే సువాసన భావోద్వేగాలను అదుపులో ఉంచి, ఒత్తిడిని తగ్గిస్తుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యల్ని అదుపు చేయడంలోనూ ఈ కొవ్వొత్తి ఎంతో మేలు చేస్తుంది.


గులాబీ క్యాండిల్

నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఈ గులాబీ సువాసనల కొవ్వొత్తుల్ని వెలిగిస్తే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. తలనొప్పి అదుపులోకి వస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని